రిటైర్మెంట్ ప్రకటించు మహాప్రభో..!!
Rohit Sharma: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా భగ్గుమంటోన్నారు. తొలి రెండు టెస్టుల్లోనూ భారీ తేడాతో ఓటమిపాలు కావడాన ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 113 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. బెంగళూరు తరహాలోనే పుణేలోనూ చేతులెత్తేశారు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

బౌలర్లు చెలరేగినప్పటికీ.. బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగులను ఛేజ్ చేయడంలో తడబడ్డారు. 245 పరుగులకు చాప చుట్టేశారు. టెస్ట్ సిరీస్ సమయం చేయాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇంకా రెండో రోజుల ఆట మిగిలే ఉండటం వల్ల కాస్త కుదురుగా ఆడి ఉంటే న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగులు చేయడం ఏ మాత్రం కష్టం కాదు.
ఓపెనర్ కేప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌తో భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనం ఆరంభమైంది. ఎనిమిది పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. శుభ్‌మన్ గిల్- 23, యశస్వి జైస్వాల్- 77, విరాట్ కోహ్లీ- 17, రిషభ్ పంత్- 0, వాషింగ్టన్ సుందర్- 21, సర్ఫరాజ్ ఖాన్- 9, ఆకాష్ దీప్- 1, రవీంద్ర జడేజా- 42, బుమ్రా- 10 (నాటౌట్) పరుగులు చేశారు.
Dear Rohit Sharma
— Kevin (@imkevin149) October 26, 2024
You have played test cricket for years now, but now you are beyond finished, it's time to give it to the deserving youngsters like Rajat patidar, Nitish Reddy etc. Please Retire & Free that 1 spot. My respect will be doubled up after your retirement ❤️ pic.twitter.com/41jR0E4WGg
Happy Retirement Rohit Sharma pic.twitter.com/haPlnD3Dlv
— Gagan🇮🇳 (@1no_aalsi_) October 26, 2024
పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా మారిన నేపథ్యంలో మిఛెల్ శాంట్నర్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్ తరహాలోనే ఇప్పుడు కూడా రెచ్చిపోయాడు. ఆరు వికెట్లు కూల్చాడు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు శాంట్నర్ ఖాతాలో పడ్డాయి. రిషభ్ పంత్ రనౌట్ అయ్యాడు. ఎజాజ్ పటేల్- 2, గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్ తీసుకున్నారు.
-Can't bat
— was_dhonism (@was_dhonism4lyf) October 26, 2024
-Can't ball
-Can't field
-Can't captain
-Can't remain fit
-Can't respect veteran players
-Eat's 10 vadapav's daily
-Play's for opponent
Is Rohit Sharma the worst ever player to play cricket? pic.twitter.com/KaVYrNPPkc
Rohit Sharma 😭 #INDvsAUS pic.twitter.com/4U8bElVzrV
— Dennis❤️ (@DenissForReal) October 8, 2023
అటు కేప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలం అయ్యాడనడానికి ఈ రెండు టెస్ట్‌లను ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా అతనిపై భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్ప్ పోస్ట్ చేస్తోన్నారు. మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.
Full support to selfless captain #INDvsNZ #RohitSharma pic.twitter.com/MUeIR7o7rg
— R𝕏 (@twitrboyy__) October 25, 2024
Rohit sharma with 0 score pic.twitter.com/9sfM4QtFwK
— memes_hallabol (@memes_hallabol) October 24, 2024
జట్టులో తన స్థానాన్ని ఖాళీ చేస్తే.. మరో టాలెంటెడ్ యంగ్ క్రికెటర్‌కు అవకాశం ఇచ్చినట్టవుతుందనీ హితబోధ చేస్తోన్నారు. క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం రోహిత్ శర్మ వైఫల్యాన్ని తప్పుపట్టడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications