షాకిచ్చిన కేన్ విలియమ్సన్: భారత్‌కు బిగ్ రిలీఫ్
IND vs NZ: భారత్‌పై బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు కదనోత్సాహంలో ఉంది. రెండో టెస్ట్‌లోనూ విజయఢంకా మోగించడానికి ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌లో ఉంటోంది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను మట్టికరిపించింది. టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కొట్టి పడేసింది. 36 సంవత్సరాల తరువాత భారత్‌లో భారత్‌పై టెస్ట్ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి.

రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమౌతోంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి వేదిక. ఈ నెల 24వ తేదీన అంటే గరువారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. దెబ్బతిన్న పులిలా ఉన్న టీమిండియాను ఇక్కడ కూడా పరాజయాన్ని రుచి చూపించాలనే పట్టుదలతో ఉన్నారు బ్లాక్ క్యాప్స్.
ఈ పరిస్థితుల్లో ఈ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్, మాజీ కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం అయ్యాడు. తొడ కండరాల్లో గాయం కారణంగా తొలి టెస్ట్ ఆడలేదు కేన్ విలియమ్సన్. రెండో టెస్ట్ నాటికి అందుబాటులోకి వస్తాడని భావించినప్పటికీ.. అది కార్యరూపాన్ని దాల్చలేకపోయింది.
కండరాల గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని వెల్లడించింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ సమయంలో తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు కేన్ విలియమ్సన్. రిహాబిలిటేషన్‌లో ఉంటోన్నాడు. ఆ కారణంగానే తొలి టెస్ట్‌కు దూరం అయ్యాడు.
ఇప్పటికీ అతను ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల రెండో టెస్ట్‌లో ఆడట్లేదని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. కేన్ గాయంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని, గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడినప్పటికీ వందశాతం ఫిట్‌నెస్‌తో లేడని అన్నారు. టెస్ట్‌లోనూ అతన్ని రీప్లేస్ చేస్తామని స్పష్టం చేశారు. మూడో టెస్ట్ నాటికి సంపూర్ణంగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కాగా- మరోవైపు రెండో టెస్ట్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది భారత్. న్యూజిలాండ్‌పై ప్రతీకార విజయం కోసం కాచుకుని కూర్చుంది. తొలి టెస్ట్‌లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేర్పులు సైతం చేసింది. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications