40 రోజుల తరువాత బ్యాట్ పట్టుకుంటోన్న రోహిత్ శర్మ: ప్లేయింగ్ 11 ఇదే
India vs South Africa 1st test: భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే మూడు చొప్పున మ్యాచ్‌లతో కూడిన టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగిసింది. టీ20 సిరీస్ సమం కాగా.. వన్డేలను భారత్ గెలుచుకుంది. ఇదే దూకుడును టెస్టుల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి టెస్ట్ మంగళవారం ఆరంభం కానుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గ్వాటెంగ్‌లో సెంచూరియన్ సూపర్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం దీనికి వేదికగా మారింది. ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంలో భారత్, కనీసం ఇందులోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడబోతోన్నాడు. టీ20, వన్డేలకు అతను అందుబాటులో లేడనే విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ కోసం జట్టులోకి వచ్చాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ తరువాత వారిద్దరూ ఫీల్డ్‌లోకి దిగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశ్రాంతి కోసం టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు జట్టుకు అందుబాటులోకి వచ్చారు.
ఈ సిరీస్ కోసం జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ చివరి నిమిషంలో తప్పుకొన్నాడు. విశ్రాంతి కావాలంటూ అతను పెట్టుకున్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది బీసీసీఐ. అతన్ని రిలీవ్ చేసింది. ఇషాన్ కిషన్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకుంది. ఇప్పుడతనే వికెట్ కీపర్.
తొలి టెస్ట్ ఆడే తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/ముఖేష్ కుమార్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11లో- డీన్ ఎల్గర్, టెంబా బావుమా (కేప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, కీగన్ పీటర్‌సన్, టోనీ డీ జోర్జి, కైలే వెర్రెయిన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్ ఆడొచ్చు. ఈ సిరీస్ తరువాత డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications