భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షమా, పరుగుల వరదా - పిచ్ రిపోర్ట్.. ఎవరికి అనుకూలం..!!
India Vs South Africa: టీ20 ప్రపంచ కప్ లో అసలైన సమరం మొదలైంది. కీలకమైన సూపర్ -8 దశలో భారత్ తొలి మ్యాచ్ ఈ రోజు ఆనుడంది. అన్ని రంగాల్లో భారత్ తో ఢీ అంటున్న దక్షిణాఫ్రికా టీంతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, అహ్మదాబాద్ లో వాతావరణ పరిస్థితులు.. పిచ్ రిపోర్ట్.. అన్నింటికంటే టాస్ కీలకంగా మారుతోంది. వీటి పైన స్పష్టత వచ్చేసింది. టాస్ తేలాల్సి ఉంది. అయితే.. ప్రస్తుత పిచ్ కండీషన్లు ఎవరికి అనుకూలం అనేది ఈ మ్యాచ్ వేళ ఇంట్రస్టింగ్ గా మారింది.
సూపర్ -8 లో ఈ రోజు భారత్ - సౌతాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. గత వరల్డ్ కప్ లోనూ ఫైనల్స్ లో తలబడి కప్పును చేజార్చుకున్న సౌతాఫ్రికా ఈసారి టీం ఇండియాపై కసి తీర్చుకోవాలని భావిస్తుంది. సౌతాఫ్రికాలో బ్యాటర్లు అందరూ మంచి ఫామ్ లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమ జట్టుగా పేరుంది. ఇదే సమయం లో భారత్ జోరు కొనసాగుతోంది. అయితే అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లు విఫలం అవుతుండటం జట్టుకు కొంత ఇబ్బందిగా మారింది. అయితే భారత్, ప్రొటీస్ జట్ల మ్యాచ్‌కు వాన ముప్పు లేదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం లేదని, వాతావరణం పూర్తి పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు.

కీలకంగా మారనున్న టాస్
ఇక, పిచ్ రిపోర్ట్ పైన స్పష్టత వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే.. మైదానం పెద్దదిగా ఉండటం వల్ల బ్యాటర్లు.. బంతిని బౌండరీ దాటించాలంటే శ్రమించాల్సిందే. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేస్తే, ఛేదన సులువవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచు ప్రభావం ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం అంత సులభం కాదనే విశ్లేషణలు ఉన్నాయి. సుమారు 15 టీ20 మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 10 మ్యాచ్‌లు గెలిచాయి. ఛేజ్ చేసిన జట్లు ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అహ్మదాబాద్‌లో టీ20 మ్యాచ్‌ల్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో.. సూర్య ప్రకటించే తుది జట్టు.. టాస్ ఫలితం ద్వారా మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది స్పష్టత రానుంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications