ఆ ఐపీఎల్ టీమ్ లో వేరు కుంపట్లు: కేప్టెన్సీ కోసం కుమ్ములాటలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజీనామాలు, వీడ్కోళ్ల పరంపర కొనసాగుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఈ టోర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ లీగ్స్ లల్లో ఆడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. తన పదవికి రాజీనామా చేశాడు.
ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ నిర్ధారించింది. రాహుల్ ద్రావిడ్ జట్టు నుండి నిష్క్రమించనున్నట్లు వెల్లడించింది. ఈ సీజన్ లో అత్యంత పేలవంగా ఆడింది రాజస్థాన్ రాయల్స్. లీగ్స్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్ లల్లో నాలుగింట్లో మాత్రమే నెగ్గింది. 10 మ్యాచ్ లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఫెయిల్యూర్ అనంతరం కొత్త కేప్టెన్ ప్రతిపాదన తెర మీదికి వచ్చింది.

ఈ విషయంలో ప్లేయర్లు మూడు గ్రూపులు విడిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి తమ అభిప్రాయాలను ఫ్రాంఛైజీకి తెలియజేస్తోన్నారని చెబుతున్నారు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టు కేప్టెన్ గా కొనసాగించాలని ఓ గ్రూప్ పట్టుబట్టగా.. మరో రెండు పేర్లు తెరమీదికి వచ్చాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ పరాగ్ కు పూర్తిస్థాయిలో నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మరో గ్రూప్.. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్నందున కేప్టెన్సీ అవకాశాన్ని జైస్వాల్ ఇవ్వాలని కొందరు ప్లేయర్లు సూచించినట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాలని సంజు శాంసన్ నిర్ణయించుకున్నట్లు ఇదివరకే వార్తలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. ఈ డిసెంబర్ లో జరిగే మెగా ఆక్షన్ కోసం ఫ్రాంఛైజీ ముందు రెండు ఆప్షన్లు పెట్టాడని, ఒకటి- తనను ట్రేడింగ్ చేయడం, రెండోది- రిలీజ్ చేయడం. ఈ రెండింట్లో రిలీజ్ కే అతను మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications