IPL 2024 auction: ఆ రేసుగుర్రం కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం

Rachin Ravindra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. ఇప్పటికే రిటెన్షన్ (Retention) ముగిసింది. మినీ వేలం పాట పూర్తయిది. ఇక అందరి కళ్లూ మెగా ఆక్షన్ మీదే ఉన్నాయి.

IPL 2024 auction: Rachin Ravindra set his base price Rs 50 Lakhs

ఐపీఎల్ 2024 ఆక్షన్ (IPL 2024 auction) ఈ నెల 19వ తేదీన జరుగనుంది. దీనికి- దుబాయ్ వేదిక. ఈ మెగా వేలంపాటలో మొత్తంగా 1,166 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. 30 మంది విదేశీ ప్లేయర్లతో సహా మొత్తంగా 77 మంది స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.

అన్ని ఫ్రాంఛైజీల యజమానులు, డైరెక్టర్లు, హెడ్ కోచ్‌లు.. దుబాయ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. తమకు కావాల్సిన ప్లేయర్లను ఎంచుకోనున్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలుపుకొని 262.95 కోట్ల రూపాయల పర్స్ మిగిలివుంది. ఈ మొత్తంతో తమకు కావాల్సిన రేసుగుర్రాలు కొనుగోలు చేయనున్నాయి.

ఈ ఐపీఎల్ 2024లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారనున్నాడు రచిన్ రవీంద్ర (Rachin Ravindra). న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్. ఓపెనింగ్‌తో పాటు టాప్ ఆర్డర్‌లో ఆడగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. ఐసీసీ వరల్డ్ కప్ 2023తో స్టార్ హోదాను సంపాదించిన ఇండియన్ ఆరిజిన్ బ్యాటర్.

IPL 2024 auction: Rachin Ravindra set his base price Rs 50 Lakhs

తన కేరీర్‌లో ఆడిన తొలి వరల్డ్ కప్‌లోనే టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లల్లో 523 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టు విజయాల్లో కీలకంగా మారాడీ లెఫ్ట్ హ్యాండర్.

ఇప్పుడతను ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ మెగా వేలంపాటలో పాల్గొబోతోన్నట్లు ప్రకటించాడు. రచిన్ రవీంద్ర బేస్ ప్రైస్ 50 లక్షల రూపాయలు. అంటే 50 లక్షల రూపాయల నుంచి వేలంపాట మొదలవుతుందన్నమాట. ఇక ఈ మొత్తం ఎన్ని కోట్ల రూపాయల వరకు వెళ్తుందనేది ఆసక్తి రేపుతోంది.

రచిన్ రవీంద్ర ఫేవరెట్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇందులో చోటు దక్కాలని అతను కోరుకున్నాడు కూడా. తనకు ఇష్టమైన ఐపీఎల్ టీమ్ ఆర్సీబీయేనని వెల్లడించాడు. అవకాశం వస్తే ఆ జట్టు తరఫున ఆడతాననీ వ్యాఖ్యానించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తన ఫేవరెట్ గ్రౌండ్‌గా చెప్పాడు రచిన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+