ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం వేళ.. బాంబు పేల్చిన ధోనీ
IPL 2024, CSK: ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మార్చి 22వ తేదీన ఈ సీజన్ ఆరంభం కానుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.
ఐపీఎల్ ఆడే అన్ని జట్లు కూడా సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. కొత్త సారథులు వచ్చారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలికారు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలారు.

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. బాంబు పేల్చాడు. ఐపీఎల్‌లో అతని పాత్ర ఏమిటనే విషయంపై సస్పెన్స్ రేకెత్తించింది. ఈ సీజన్‌లో కూడా సీఎస్‌కే కేప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఉండటం ఖాయమని భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అతని నుంచి ఇలాంటి మెసేజ్ ఒకటి పోస్ట్ కావడం ఆసక్తిగా మారింది.
వచ్చే ఐపీఎల్ 2024 సీజన్‌లో తాను కొత్త రోల్‌లో కనిపించబోతోన్నట్లు ప్రకటించాడు ధోనీ. కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఎదురు చూస్తూ ఉండలేకపోతున్నాను..స్టే ట్యూన్డ్ అంటూ తాను చెప్పదలచుకున్నది రెండు ముక్కల్లో చెప్పేశాడు. ఆ రోల్ ఏమిటనేది ఇప్పుడు కొత్త సందేహాలను సృష్టించింది.
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా నిలిచాడు ధోనీ. అయిదుసార్లు తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. 2010, 2011, 2018, 2021, 2023ల్లో ధోనీ సారథ్యంలో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది సీఎస్‌కే. వ్యక్తిగతంగా అతని ట్రాక్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది.
ఇప్పటివరకు 250 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 5,082 పరుగులు చేశాడు. 38.79 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ మొత్తం మీద 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని పేరు మీద. వికెట్ కీపర్‌గానూ సత్తా చాటాడు. 142 క్యాచ్‌లు పట్టాడు. 42 స్టంపింగ్స్‌తో బ్యాటర్‌ను పెవిలియన్ దారి పట్టించాడు.












Click it and Unblock the Notifications