IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల పూర్తి జాబితా: కావ్యా మళ్లీ అదే తప్పు చేసిందా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. నేడు రిటెన్షన్ (Retention) జరుగనుంది. మినీ వేలం పాట (IPL 2024 auction) ఏర్పాటైంది. రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఇదివరకే వెలువడింది.

రిటెన్షన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్లేయర్స్ స్వాపింగ్‌కు పూనుకుంది. ఆర్సీబీ (RCB) బౌలర్ షాబాజ్ అహ్మద్ (Shahbaz Ahamad)ను ట్రేడింగ్ చేసింది ఎస్ఆర్‌హెచ్ (SRH). అతనికి బదులుగా మయాంక్ డాగర్ (Mayank Dagar)ను ఆర్సీబీకి పంపించింది.
రిటెన్షన్ సందర్భంగా ఆదిల్ రషీద్, అకిల్ హొసెన్, హ్యారీ బ్రూక్, కార్తీక్ త్యాగి, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మను విడుదల చేసింది. ఇక- అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మర్క్‌రమ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫాజిల్ హాక్ ఫారూఖీ, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్‌లను నిలబెట్టుకుంది.
అలాగే మార్కో జన్‌సెన్, మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండే, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఉపేంద్ర సింగ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇదే జట్టుతో ఐపీఎల్ 2024ను ఎదుర్కొనబోతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
జట్టులో మరోసారి బ్యాటర్ల కంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేసుకోవడానికే ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ చీఫ్ కావ్యా మారన్ (Kavya Maran) ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. ఆల్‌రౌండర్లకూ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్కో జన్‌సెన్‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. మిగిలిన వారిలో బౌలర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications