సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గండం
KKR vs SRH Qualifier 1: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్ 1 ఆడబోతోంది. టేబుల్ టాపర్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఎదుర్కొనబోతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకోవచ్చు. ఓడిన వాళ్లకు మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన టీమ్‌ను ఢీకొట్టొచ్చు. ప్రస్తుతం పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాలో ఉన్నాయి కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్.

రెండు జట్లు కూడా సమవుజ్జీలే. బ్యాటింగ్ పవర్‌హౌస్‌లే. మొత్తం 14 మ్యాచ్‌లల్లో తొమ్మిదింట్లో నెగ్గింది కేకేఆర్. మూడు మ్యాచ్‌లల్లో మాత్రమే ఓడింది. చివరి రెండు మ్యాచ్‌లూ వర్షం వల్ల రద్దయ్యాయి. మొత్తం 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుందీ టీమ్. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ పొజీషన్‌కు రావడం కేకేఆర్‌కు ఇదే తొలిసారి.
కేకేఆర్‌కు ధీటుగా సత్తా చాటింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొత్తం 14 మ్యాచ్‌లల్లో ఎనిమిదింట్లో విజయఢంకా మోగించింది. అయిదింట్లో పరాజయం పాలైంది. ఒక్క మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్ 1లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది.
ఎలిమినేటర్‌తో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టే మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఆరెంజ్ ఆర్మీ ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. తుదిజట్టులో మెరికల్లాంటి ప్లేయర్లను తీసుకోవడం ఖాయం. బ్యాటింగ్, బౌలింగ్ ఆల్‌రౌండర్లతో జట్టును నింపేయవచ్చు టీమ్ మేనేజ్‌మెంట్. తనకంటే ఓ మెట్టు పైనే ఉన్న కేకేఆర్‌పై విజయం సాధించడానికి సర్వశక్తులనూ ఒడ్డాల్సి ఉంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్‌ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కోల్‌కత నైట్ రైడర్స్ తుదిజట్టులో- సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకూల్ రాయ్/వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు ఆడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications