IPL 2024: CSKతో తొలి మ్యాచ్ -టాస్ గెలిచిన RCB బ్యాటింగ్-టీమ్స్ ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. చెన్నై చేపాక్ స్టేడియంలో ఆరంభ వేడుకలు ఆకాశాన్నంటాయి. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు నెలలుగా క్రికెట్ కు పూర్తిగా దూరమైన కింగ్ విరాట్ కొహ్లీ ఈ మ్యాచ్ తో తిరిగి గ్రౌండ్ లోకి దిగాడు. అటు కెప్టెన్సీ వదులుకున్నాక ధోనీ కూడా తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తొలి మ్యాచ్ లో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును పరిశీలిస్తే.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిషెల్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, సమీర్ రిజ్వీ, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్ పాండే ఉన్నారు. అలాగే సబ్ టిట్యూట్ ఆటగాళ్లుగా శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, షేక్ రషీద్, నిశాంత్ సంధు, మొయిన్ అలీ ఉన్నారు.
అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీ, విరాట్ కొహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్గారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. మరోవైపు ఈసారి ఐపీఎల్ సీజన్ కు చెన్నై కెప్టెన్ గా ఉంటాడని భావించిన మహేంద్ర సింగ్ ధోనీ చివరి నిమిషంలో తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించాడు. దీంతో ఐపీఎల్ లో తొలిసారి గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.












Click it and Unblock the Notifications