కర్మ ఈజ్ బ్యాక్: మళ్లీ రోహిత్ శర్మకే ముంబై ఇండియన్స్ కేప్టెన్సీ పగ్గాలు?

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ కేప్టెన్సీ కథ.. మళ్లీ మొదటికొచ్చినట్టే. వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడబోయే జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తాడంటూ ప్రకటించిన ఆ జట్టు ఫ్రాంఛైజీ.. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

హార్దిక్ పాండ్యా గాయపడటం ముంబై ఇండియన్స్ కేప్టెన్సీ కష్టాలను రెట్టింపు చేసినట్టయింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండకపోవచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- కొత్త సారథిని ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోందా టీమ్ మేనేజ్‌మెంట్.

IPL 2024: Rohit Sharma or Jasprit Bumrah likely appoint as a captain to Mumbai Indians

గాయం వల్ల హార్దిక్ పాండ్యా గనక సీజన్ మొత్తానికీ దూరం అయితే- మళ్లీ రోహిత్ శర్మను ఆశ్రయించక తప్పకపోవచ్చు. జట్టును మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా మలిచిన హిట్ మ్యాన్‌ను కాదని చివరి నిమిషంలో హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసుకోవడం, ఇప్పుడతను గాయం వల్ల తప్పుకోవాల్సి రావడం చకచకా సాగిపోయాయి.

ఈ పరిణామాలు రోహిత్ శర్మ అభిమానులను గాల్లో తేలిపోయేలా చేస్తోన్నాయి. రోహిత్‌కు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలాన్ని అటు ముంబై ఇండియన్స్, ఇటు హార్దిక్ పాండ్యాకు అనుభవించాల్సి వచ్చిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు ఫ్యాన్స్. కర్మ ఈజ్ బ్యాక్.. అంటూ పోస్టులు పెడుతున్నారు.

కేప్టెన్సీ పగ్గాలను అందుకోవడానికి రోహిత్ శర్మ అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటనేది ముంబై ఇండియన్స్‌కు కొరుకుడు పడట్లేదు. ప్రత్యామ్నాయంగా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను కేప్టెన్‌గా ఎంపిక చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో టీమిండియాకు పార్ట్ టైమ్ కేప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది బుమ్రాకు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+