Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2024: ధోనీ స్ధానంలో చెన్నై కెప్టెన్ గా రోహిత్ శర్మ? అంబటి రాయుడు షాకింగ్..

ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొదలుకాకముందే సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జట్లలో కచ్చితంగా ఆడతారని భావిస్తున్న ప్లేయర్లు, కెప్టెన్లు మారిపోతున్నారు. అలాగే వారి స్ధానాల్లో మరికొందరు వచ్చి చేరిపోతున్నారు. ఇప్పటికే నమోదైన అతిపెద్ద సంచలనం ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు కూడా ఇందులో ఒకటి. ముంబై కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి అతని స్ధానంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తీసుకోవడం పెను సంచలనం అయింది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో సంచలనం కూడా తప్పదా అన్న చర్చ మొదలైంది.

దీనికి కారణం చెన్నె సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలే. ఓ జాతీయ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ముంబైను వీడి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరతాడనే అర్దం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. అలాగే ధోనీ స్ధానంలో చెన్నై కెప్టెన్సీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఐపీఎల్ లో ఇది మరో సంచలనంగా మారుతుందా అన్న చర్చ సాగుతోంది.

IPL 2024 rohit sharma to replace ms dhoni as csk captain ambati rayudu hints

రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ అంబటి రాయుడు.. ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టడం ద్వారా రోహిత్ వేరే జట్టుకు మారే సమయం ఆసన్నమైందని చెప్పాడు. రోహిత్‌లో ఇంకా 5-6 ఏళ్ల క్రికెట్ మిగిలి ఉందన్నాడు. అతను ముంబైని విడిచిపెట్టి, కొత్త జట్టులో చేరాలని సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనికి బాగా సూట్ అవుతుందన్నాడు. ప్రాంప్ట్ చేస్తే అతను జట్టుకు కెప్టెన్ కూడా కాగలడంటూ అంబటి రాయుడు తెలిపాడు.

IPL 2024 rohit sharma to replace ms dhoni as csk captain ambati rayudu hints

ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా సారథ్యం వహించగల సామర్థ్యం రోహిత్ శర్మకు ఉందని అంబటి రాయుడు తెలిపాడు. వ్యక్తిగతంగా తాను రోహిత్ శర్మను సీఎస్కే కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నానని రాయుడు చెప్పాడు. రోహిత్ సీఎస్కేకి వెళ్లడంపై రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో సంచలనంగా మారాయి. రోహిత్ ను ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ఇప్పటికే అతని అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్.. ముంబైకి పనికిరాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయుడు వ్యాఖ్యలతో రోహిత్ చెన్నై వైపు చూస్తున్నాడా అన్న చర్చ సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+