IPL 2024: ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ? ఎలాగో తెలుసా ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రథమార్ధం ముగిసింది. ఇవాళ్టి నుంచి ద్వితీయార్ధం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకూ జరిగిన 37 మ్యాచ్ ల్లో కొన్ని టీమ్ లు 7, మరికొన్ని టీమ్ లు 8 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో అత్యధికంగా 6 విజయాలతో రాజస్తాన్ రాయల్స్ టాప్ లో ఉంది. చెరో ఐదేసి విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పదేసి పాయింట్లు సాధించి రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి.

ఆ తర్వాత చెరో నాలుగు విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్ధానాల్లో ఉన్నాయి. చెరో మూడు విజయాలతో ముంబై, ఢిల్లీ, ఏడు, ఎనిమిది స్దానాల్లో నిలిచాయి. ఇక రెండు మ్యాచ్ లే గెలిచిన పంజాబ్ 9వ స్ధానంలోనూ, ఒకే మ్యాచ్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరిదైన పదో స్ధానంలో ఉంది. అయితే ఇందులో లీగ్ దశ దాటే సమయానికి టాప్ 4లో ఉన్న జట్లు మాత్రమే ప్లేఆఫ్స్ కు చేరుకుంటాయి.

IPL 2024 Royal Challengers bengaluru still has playoff chance- here is how

ప్రస్తుతం ఈ పది జట్ల ప్రదర్శన, గణాంకాలు చూస్తుంటే టాప్ 4లో ఉన్న రాజస్తాన్, కోల్ కతా, హైదరాబాద్, చెన్నె, లక్నో, గుజరాత్ జట్లకు మాత్రమే ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి లీగ్ నుంచి నిష్కృమించేలా కనిపిస్తున్న బెంగళూరుకు కూడా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నట్లు తాజా విశ్లేషణలు చెప్తున్నాయి.

ఇక్కడి నుంచి ఆర్సీబీ ప్లేఆఫ్ కు చేరాలంటే ఇక తమకు మిగిలిన 6 మ్యాచ్ లనూ గెలవడం తప్పనిసరి. ఇందులో గుజరాత్ తో రెండేసి మ్యాచ్ లు, హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ, చెన్నైతో తలో మ్యాచ్ ఉన్నాయి. ఇవన్నీ గెలిస్తే ఆర్సీబీకి మరో 12 పాయింట్లు లభించి 14 పాయింట్లకు చేరుకుంటుంది. అలాగే ప్రస్తుతం టాప్ 3లో ఉండి ప్లేఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉన్న రాజస్తాన్, కోల్ కతా, హైదరాబాద్ తమ ఇతర మ్యాచ్ లలో గెలుస్తూ, ఆర్సీబీ కూడా గెలుస్తుంటే మధ్యలో ఉన్న మిగిలిన జట్ల అవకాశాలు దాదాపు సన్నగిల్లుతాయి. అలాగే కిందనుంచి ఆరు స్ధానాల్లో ఉన్న జట్లూ ఒకదానిపై ఒకటి గెలుస్తుంటే చివరికి ఆర్సీబీకి నాలుగో స్ధానం ఖరారవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+