IPL 2024: జెర్సీనీ మార్చేసిన సన్ రైజర్స్- అంతా కొత్త కొత్తగా...!

గతేడాది ఇండియన్ ప్రీమియర్ సీజన్ లో ఎదురైన చేదు అనుభవాల్ని మర్చిపోయి కొత్త సీజన్ ను ఉత్సాహంగా ప్రారంభించేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు సన్ రైజర్స్ జట్టు కొత్త జెర్సీని తీసుకొచ్చింది. ఫియరీ అంటూ తెచ్చిన ఈ జెర్సీని ధరించి ఈసారి ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో దర్శనమివ్వబోతున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీసుకొచ్చిన ఈ కొత్త జెర్సీ ఫియరీ స్లీక్, వైబ్రంట్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. జట్టు స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ జెర్సీని డిజైన్ చేసినట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ కొత్త జెర్సీని ధరించిన ఫొటోల్ని సన్ రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఫైర్ కిట్, ఫైర్ ప్లేయర్, ఆల్ సెట్ ఫర్ ఐపీఎల్ 2024 పేరుతో ఓ కొటేషన్ ను కూడా ఈ పోస్టులకు జత చేసింది.

IPL 2024 Sunrisers Hyderabad team unveils new jersey for this season

ఈసారి సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ గా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సారధి ప్యాట్ కమ్మిన్స్ ను ఎంచుకుంది. గతేడాది కెప్టెన్ గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్ క్రమ్ వైఫల్యాల నేపథ్యంలో కమిన్స్ ను భారీ రేటుకు కొనుక్కుని మరీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలాగే హెడ్ కోచ్ గా న్యూజీలాండ్ మాజీ స్పిన్నర్ డానియల్ వెటోరీని ఎంచుకుంది. 2016లో చివరి సారిగా టైటిల్ గెల్చిన సన్ రైజర్స్ ఈ సారి చేస్తున్న మార్పులతో జట్టు తలరాత మారుతుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+