IPL 2024: ఆ స్టార్ బౌలర్ ను బౌలింగ్ వద్దని చెప్పేసిన ధోనీ ? ఓన్లీ బ్యాటింగ్, ఫీల్డింగ్..
మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్తే గుర్తుకొచ్చేవి ప్రయోగాలే. తన జట్టులో క్రికెటర్ల బలాలు, బలహీనతలు పసిగట్టి వారిని ఎక్కడ వాడుకోవాలో తెలిసిన నాయకుడిగా ధోనీకి మంచి పేరుంది. గతంలో ధోనీ చేసిన విజయవంతమైన ప్రయోగాలే అతన్ని సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలబెట్టాయి. ఇప్పుడు ఇదే కోవలో ఈసారి ఐపీఎల్లో చెన్నె సూపర్ కింగ్స్ జట్టులోనూ ఇలాంటి ప్రయోగానికి ధోనీ రెడీ అయ్యాడు. అంతే కాదు ఈ విషయం సదరు ఆటగాడికి గత సీజన్ ముగియగానే ధోనీ చెప్పేశాడంట.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో విజయవంతమైన స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న శ్రీలంక ఆల్ రౌండర్ మహేష్ తీక్షణ హ్యాట్రిక్ టోర్నీ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో 2022 ఐపీఎల్ లో 9 మ్యాచ్ లు ఆడి 12 వికెట్లు తీసిన తీక్షణ... చెన్నై ఐదో టైటిల్ గెలిచిన 2023 ఐపీఎల్లో 11 వికెట్లు తీశాడు. కానీ ఫీల్టింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

గత సీజన్ లో లంక ఆల్ రౌండర్ మహేష్ తీక్షణ వరుసగా క్యాచ్ లు వదిలేయడం, బౌండరీలు వదిలేయడంతో చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో తీక్షణను ట్రోలింగ్ కూడా చేసారు. అయినా ధోనీ మాత్రం ఒక్క మాట అనలేదు. అయితే గత ఐపీఎల్ సీజన్ లో వరుస ఫీల్డింగ్ వైఫల్యాలు ఎదుర్కొన్నా జట్టు టైటిల్ గెలవడంతో ఇవన్నీ అందులో కలిసిపోయాయి. చివరికి టోర్నీ టైటిల్ అందుకున్నా స్వదేశానికి బయలుదేరే సమయంలో ధోనీని కలిశాడు. దీంతో ఎప్పటిలాగే మిస్టర్ కూల్ ధోనీ తీక్షణకు షాకిచ్చాడు.
ఈసారి నువ్వు బౌలింగ్ చేయొద్దు, బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేయమని తీక్షణకు ధోనీ సూచించాడు. దీంతో వరుసగా రెండు సీజన్లలో తన బౌలింగ్ తో చెన్నైకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన తీక్షణకు ఏం చెప్పాలో తెలియలేదు. అయినా ధోనీపై ఉన్న నమ్మకంతో సరేనని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆలోచించుకుంటే ధోనీ ఏం చేసినా తమ కోసమే చేస్తాడన్న విషయం అర్ధమైంది. దీంతో ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పుకొచ్చాడు. ఈసారి ఐపీఎల్లో ధోనీ తన నుంచి మంచి బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా ఆశిస్తున్నాడని తీక్షణ వెల్లడించాడు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications