ఐపీఎల్ బెట్టింగ్స్ ఈజ్ ఇంజ్యూరియస్ టు వెల్త్
IPL 2025 schedule: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గుడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.
2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
మార్చి 23వ తేదీన అంటే రెండో రోజున తన తొలి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మళ్లీ మే 20వ తేదీన ఈ రెండు జట్లూ మరోసారి తలపడతాయి. మార్చి 8వ తేదీన చెపాక్ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది సీఎస్‌కే. మళ్లీ మే 3వ తేదీన ఈ రెండు జట్లూ ఢీ కొడతాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.
ఐపీఎల్ సీజన్ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బెట్టింగ్ రాయుళ్ల సైతం విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు ప్రతి సీజన్‌లోనూ నమోదవుతూనే వస్తోన్నాయి. బెట్టింగులు కాసిన వాళ్లల్లో ఏ ఒక్కరు కూడా బాగుపడిన దాఖలాలు లేవనే చెప్పుకోవచ్చు. వీటి మీద డబ్బులు ధారపోసి రోడ్డు మీద పడ్డ జీవితాలుు గతంలో చాలానే ఉన్నాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెర మీదికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగుల జోలికి వెళ్లొద్దని సూచించారు. బెట్టింగులను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబ సభ్యులు గానీ, బంధుమిత్రులు గానీ బెట్టింగులు ఆడకుండా నిరోధించాలని చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారాయన.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications