Venkatesh Iyer: నా పేరు ఆకాష్ అయ్యర్..నన్ను కొనండ్రా బాబూ..!!
KKR-Venkatesh Iyer:ఐపీఎల్ మెగా వేలం 2025 జెడ్డాలో జరుగుతోంది.వేలంపాటలో ఆయా ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తప్పదనుకుంటే ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. వేలానికి వచ్చిన ఇంకొందరు స్టార్ ఆటగాళ్లను ఏకంగా పక్కనే పెట్టేయడంతో వారు అమ్ముడుపోలేదు. ఇక ఆయా ఫ్రాంఛైజీలు కొనుగోలు చేస్తున్న ఆటగాళ్లపై ఆ జట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా బలైంది వెంకటేష్ అయ్యర్.
వెంకటేష్ అయ్యర్... కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చేరడం ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ 2025 మెగావేలంలో ఈ ఆటగాడిని తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. ఏకంగా రూ.23.75 కోట్లు ఈ ఆల్‌రౌండర్ పై వెచ్చించి దక్కించుకుంది నైట్‌రైడర్స్.దీంతో ఈ సారి ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా వెంకటేష్ అయ్యర్ నిలిచాడు. దీంతో 2021 నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోనే అయ్యర్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

తన అరంగేట్ర సీజన్‌లో వెంకటేష్ అయ్యర్ 370 పరుగులు చేసి కోల్‌కతా ప్లేఆఫ్స్ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు.ఇక గత సీజన్‌లో వెంకటేష్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే 13 ఇన్నింగ్స్‌లో 158.79 స్ట్రైక్‌రేట్‌తో 370 పరుగులు చేశారు. అంతేకాదు కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా కూడా నిలిచింది. మొత్తం నాలుగు సీజన్లు కలిపి 1326 పరుగులు చేశాడు వెంకటేష్ అయ్యర్.ఇందులో ఒక సెంచరీ 11 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం వెంకటేష్ అయ్యర్‌ను రీటెయిన్ చేసుకోకుండా వేలంపాటకు రిలీజ్ చేసింది.
My name is Aakash Iyer anyone up for the bidding ? 😅
— Aakash (@believeraakash) November 24, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, రమణ్‌దీప్ సింగ్‌లను రీటెయిన్ చేసుకుంది. అయితే వెంకటేష్ అయ్యర్‌ను మాత్రం వేలంపాటలో తిరిగి దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నింది. అంటే ఎంత సొమ్మైనా సరే వెచ్చించి తీసుకోవాలన్న స్ట్రాటజీతో ముందుకెళ్లి సక్సెస్ అయ్యింది. ఇక 2024 సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్‌ను వదిలేసిందంటే అయ్యర్ పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది షారుఖ్‌ఖాన్ జట్టు.
వెంకటేష్ అయ్యర్‌ను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంపై కోల్‌కతా ఫ్యాన్స్ నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. "నాపేరు ఆకాష్ అయ్యర్..నన్ను ఎవరైనా కొనుగోలు చేయండి" అంటూ ఒకరు పోస్టు చేశారు. మరొకరైతే గంభీర్ ఆక్షన్ టేబుల్ వద్ద ఉండి ఉండాల్సింది. స్టార్క్,శ్రేయాస్ అయ్యర్‌లాంటి స్టార్ ఆటగాళ్లను వదిలేసి వెంకటేష్ అయ్యర్ పై రూ.23.75 కోట్లు కుమ్మరించడమేంటని ప్రశ్నించారు. ఇంకో అభిమాని అయితే కేకేఆర్ సరైన నిర్ణయం తీసుకుందంటూ పోస్టు చేశాడు.వెంకటేష్ అయ్యర్ పై 23.75 కోట్లు పెట్టే బదులు ముందే అతన్ని ఎందుకు రీటెయిన్ చేసుకోలేదని ప్రశ్నించారు.ఇలా ఫ్యాన్స్ నుంచి రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.
This is why we needed Gambhir at the auction table. Not going after Shreyas Iyer or Mitch Starc for a higher amount but spending 23.75cr on Venkatesh Iyer. #TATAIPLAuction
— Prantik (@Pran__07) November 24, 2024
నో డౌట్ వెంకటేష్ అయ్యర్ క్లాసిక్ ప్లేయర్.కానీ అంత మొత్తాన్ని ఆ ఒక్కడిపై వెచ్చించాల్సిన పనిలేదని, ఇంకా మంచి ఆటగాళ్ల కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ వెళ్లి ఉంటే బాగుండనేది విశ్లేషకుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications