అరె వాహ్: ఉప్పల్.. అదిరిపోయే లుక్: పరుగుల వరద పారడమే లేట్..

IPL 2025 schedule: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గుడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్‌ ఈడెన్ గార్డెన్స్‌ దీనికి వేదిక.

మన వద్దే..

2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

సీఎస్‌కే..

మార్చి 23వ తేదీన అంటే రెండో రోజున తన తొలి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మళ్లీ మే 20వ తేదీన ఈ రెండు జట్లూ మరోసారి తలపడతాయి. మార్చి 8వ తేదీన చెపాక్ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది సీఎస్‌కే. మళ్లీ మే 3వ తేదీన ఈ రెండు జట్లూ ఢీ కొడతాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో.

Uppal Stadium

23న బోణీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్‌ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.

రూ. 5 కోట్లతో

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. ఉప్పల్ స్టేడియాన్ని ఆధునికీకరించింది. దీనికోసం అయిదు కోట్ల రూపాయలను వ్యయం చేసింది. వీక్షకుల కోసం ఇప్పటివరకు అందుబాటులో లేని కొన్ని అదనపు వసతులు, సౌకర్యాలను కల్పించింది.

కొత్త సీట్లు.. కొత్త రంగులు

ధ్వంసమైన సీట్ల స్థానంలో కొత్తవి వచ్చాయి. రూఫ్‌కూ మరమ్మతులు చేశారు. గతంలో వర్షం పడితే కారిపోయేలా ఉండేదక్కడి రూఫ్. అలాంటి వాటన్నింటికీ రిపేర్లు చేశారు. స్టేడియంలోని సీట్లన్నింటికీ కొత్త రంగులు వేయించింది. మెరూన్ రెడ్ కలర్‌లో మెరిసిపోతున్నాయవి. టైల్స్‌నూ మార్చివేశారు.

డ్రెస్సింగ్ రూమ్‌లనూ..

నార్త్ ఎండ్ స్టాండ్స్ వైపు కొత్తగా రెస్ట్ రూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే- ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు చోట్లా ఇప్పటివరకు ఉన్న ఏసీ పరికరాలను తొలగించి.. వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చింది హెచ్‌సీఏ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+