Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా ఛాయిస్ కొహ్లీ..నా కల నెరవేర్చారు..ఆర్సీబీ గెలుపుపై విజయ్ మాల్యా ఎమోషనల్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా ఎన్నడూ టోర్నీ గెలిచిన చరిత్ర లేని ఆర్సీబీ నిన్న మాత్రం పంజాబ్ పై ఘన విజయంతో ఆ ఫీట్ అందుకుంది. దీంతో పాటు అదే 18 ఏళ్లుగా టీమ్ లో ఉంటూ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న కింగ్ విరాట్ కొహ్లీ కల కూడా నెరవేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆర్సీబీతో పాటు కొహ్లీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఇదే క్రమంలో ఆర్సీబీ టీమ్ మాజీ యజమాని అయిన విజయ్ మాల్యా కూడా ఎక్స్ లో స్పందించారు. ఆర్సీబీ టీమ్ తో పాటు కింగ్ కొహ్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇందులో ఆర్సీబీలో కీలక ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం తనకు అప్పట్లో దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తన కల నెరవేరిందంటూ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. దీంతో మాల్యా ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

IPL 2025 Vijay Mallya recollects memories with RCB virat kohli after winning maiden IPL trophy

తాను ఆర్సీబీని స్థాపించినప్పుడు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు కి రావాలనేది తన కల అని విజయ్ మాల్యా గుర్తుచేసుకున్నారు. యువకుడిగా లెజెండరీ కింగ్ కోహ్లీని ఎంచుకునే అవకాశం తనకు లభించిందన్నారు. అలాగే అతను 18 సంవత్సరాలు ఆర్సీబీతో ఉండటం గొప్ప విషయం అన్నారు. ఆర్సీబీ చరిత్రలో చెరగని భాగంగా ఉన్న క్రిస్ గేల్ , మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ లను ఎంచుకునే గౌరవం కూడా తనకు లభించిందన్నారు.

చివరకు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకి చేరుకుందన్నారు. తన కలను నిజం చేసిన వారందరికీ విజయ్ మాల్యా అభినందనలు , ధన్యవాదాలు తెలిపారు. ఆర్సీబీ అభిమానులు చాలా ఉత్తములని , వారు ఐపీఎల్ ట్రోఫీకి అర్హులని మాల్యా పేర్కొన్నారు. ఈ సాలా కప్ బెంగళూరు బరుతే! అంటూ మాల్యా తన ట్వీట్ ముగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+