IPL 2025: ఐపీఎల్ మొదటి మ్యాచ్ రద్దవుతుందా?

IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ శనివారం(మార్చి 22) ప్రారంభం కానుంది.సీజన్ లోని మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో దిశా పటాని, శ్రేయా ఘోషల్ వంటి కళాకారులతో కార్యక్రమాలను కూడా ఖరారు చేశారు. అయితే ఐపీఎల్ ప్రారంభోత్సవానికి కేవలం ఒకరోజు ముందు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఈ సీజన్ లో తొలి మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది.

గురువారం నుంచి ఆదివారం వరకు దక్షిణ బెంగాల్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరిగే మార్చి 22న ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదివారం నాడు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఆక్యూవెదర్ ప్రకారం.. కోల్‌కతాలో శనివారం వర్షం పడే అవకాశం 74 శాతం ఉండగా.. మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం 97 శాతం ఉంది. సాయంత్రం వేళల్లో వర్షం పడే అవకాశం 90 శాతానికి చేరుకుంటుంది. అందువల్ల ఐపీఎల్ 18వ ఎడిషన్ మొదటి రోజున ఈడెన్ గార్డెన్స్ లో భారీ వర్షం పడటం దాదాపు ఖాయం. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫలితం పొందడానికి తగినన్ని ఓవర్లు ఆడగలరా అనేది ప్రస్తుతానికి చెప్పడం కష్టం.

IPL 2025 Will the KKR vs RCB First Match Be Cancelled Due to Weather

ఆ మ్యాచ్ గౌహతిలో జరుగుతుందా.. ?
ఇదిలా ఉండగా.. ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను ఇప్పటికే తిరిగి షెడ్యూల్ చేస్తున్నారు. ఏప్రిల్ 6న లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. ఆ రోజున 'రామ నవమి' వేడుకలు జరుగుతున్నందున ఐపీఎల్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని పోలీసులు వ్యక్తం చేసినందున, ఆ మ్యాచ్‌ను గౌహతికి మార్చనున్నట్లు CAB (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ఇంతకుముందు తెలిపారు. ఈ పండుగను జరుపుకునేందుకు పశ్చిమబెంగాల్ లో 20 వేలకు పైగా ఊరేగింపులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+