IPL 2026: అభిషేక్ శర్మ తొండాట!
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తొండాట ఆడాడని ఆరోపిస్తూ కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లియర్‌గా క్యాచ్ ఔట్ అని తెలిసి కూడా ఏం తెలియనట్లు డ్రామా ఆడాడని మండిపడుతున్నారు.
శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ.. ఆరెంజ్ ఆర్మీకి పవర్ ప్లేలోనే 75 పరుగుల భారీ స్కోర్ అందించాడు.
సంజూ రివ్యూతో..
దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మను జేమీ ఓవర్టన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ వికెట్‌ను సీఎస్‌కే రివ్యూ ద్వారా రాబట్టింది. ఓవర్టన్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని అభిషేక్ శర్మ థర్డ్ మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. క్యాచ్ అందుకున్న సంజూ.. వికెట్ అని సెలెబ్రేట్ చేసుకోగా.. అంపైర్ ఔటివ్వలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బౌలర్‌తో పాటు ఇతర సీఎస్‌కే ఆటగాళ్లు కూడా అప్పీల్ చేయలేదు. కానీ సంజూ శాంసన్ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు సూచించాడు. సమీక్షలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే అభిషేక్ శర్మకు ఇది ముందే తెలుసని, కానీ తెలియనట్లు నాటకం ఆడాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. క్రీజును వీడే సమయంలో బ్యాట్ సౌండ్ అనుకున్నానని అభిషేక్ శర్మ సైగలు చేశాడు.
ధోనీ తరహా కీపింగ్‌తో..
ఈ విషయంలో అభిషేక్ శర్మ తప్పులేదని మరికొందరు అంటున్నారు. కిక్కిరిసిన మైదానంలో అభిమానుల అల్లరి మధ్య కొన్నిసార్లు బ్యాటర్లకు బంతి ఎడ్జ్ అయినట్లు తెలియదని అతనికి అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ధోనీ రివ్యూ సిస్టమ్(DRS) తరహాలో సంజూ అతని పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడని సీఎస్‌కే ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఈ వికెట్ గేమ్ ఛేంజింగ్ మూమెంటమ్‌గా నిలిచింది. అభిషేక్ ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/22), జెమీ ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీయగా..ముఖేష్ చౌదరి(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్జప్నీత్ సింగ్(1/34)కు ఒక వికెట్ దక్కింది.
BIG TURNAROUND! 🚨🎯
— KBKE : Cricket & Bollywood 👁️ (@kahanibollyki) April 18, 2026
Sanju Samson was absolutely certain with the call, and the decision gets overturned! 👀
Abhishek Sharma departs as Jamie Overton gets the big wicket! ⚡
A huge breakthrough for CSK! 📉
SRH - 93/3 (8)#TravisHead #ruturajgaikwad #sanjusamson #srhvcsk… pic.twitter.com/ZmE1yZqGXY












Click it and Unblock the Notifications