Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని అందిస్తే.. ఆ తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగి కేకేఆర్‌ పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడారు. నితీష్ కుమార్ రెడ్డి(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని(4/41) నాలుగు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా(2/47) రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగీ, అంకూల్ రాయ్ చెరో వికెట్ తీసారు.

IPL 2026 Angkrish Raghuvanshi Unlucky Run-Out Triggers KKR Collapse as SRH Secure Massive Win

అనంతరం కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించినా.. రింకూ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), ఫిన్ అలెన్(7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/21) మూడు వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/14), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్ష్‌దూబేకు ఒక వికెట్ దక్కింది.

రనౌట్.. టర్నింగ్ పాయింట్..

227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న కేకేఆర్.. అనవసర రనౌట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా అసాధారణ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించిన రఘు వంశీ రెండు రనౌట్స్‌కు కారణమయ్యాడు. ఇందులో ఒకసారి సహచర బ్యాటర్ కామెరూన్ గ్రీన్‌ను బలి చేసి బచాయించిన అతను రెండో సారి మాత్రం మూల్యం చెల్లించుకున్నాడు.

అనవసర పరుగు పరుగెత్తి కామెరూన్ గ్రీన్(2) రనౌట్‌కు కారణమైన అతను రెండో సారి రింకూ సింగ్‌తో సమన్వయ లోపంతో వికెట్ పారేసుకున్నాడు. ముఖ్యంగా రింకూ సింగ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 46 పరుగులు జోడీంచిన అనంతరం రనౌట్‌గా వెనుదిరిగి కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు. ఎషాన్ మలింగా అద్భుత త్రో కారణంగా రఘువంశీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ రనౌట్ కాకుండా రఘువంశీ కాసేపు క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆ తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+