IPL 2026: ఇదేం ఆటరా అయ్యా.. లక్నో ఖాతాలో మూడో ఓటమి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమిపాలైంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 5 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. చెత్త బ్యాటింగ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్ బదోని(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), ముకుల్ చౌదరి(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్‌(4/24)తో పాటు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(3/27) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజెల్‌వుడ్‌(1/20)కు ఒక వికెట్ దక్కింది.

IPL 2026 LSG Batting Collapse Triggers Heavy Defeat as RCB Bowlers Dominate at Chinnaswamy

అనంతరం ఆర్‌సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రజత్ పటిదార్(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27), జితేష్ శర్మ(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) దూకుడుగా ఆడారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/32) మూడు వికెట్లు తీయగా.. ఆవేష్ ఖాన్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. లక్నో మూడో ఓటమితో ఏడో స్థానానికి పడిపోయింది.

నిప్పులు చెరిగిన హాజెల్ వుడ్..

జోష్ హాజెల్‌వుడ్ ఒక్క వికెటే తీసినా.. లక్నో మూమెంటమ్‌ను దెబ్బతీసాడు. కట్టుదిట్టమైన బంతులతో లక్నో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. డేంజరస్ నికోలస్ పూరన్‌ను ఔట్ చేయడంతో పాటు ఇతర బ్యాటర్లు పరుగులు చేయకుండా ఒత్తిడి పెంచాడు. లక్నో బ్యాటింగ్ పతనాన్ని శాసించిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై కోహ్లీ 49 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ ఇరు జట్ల అభిమానులను నిరాశపర్చింది. లక్నో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+