IPL 2026: ఐపీఎల్ వాయిదా తప్పదా ? 3 కారణాలివే..!

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఓసారి షెడ్యూల్ సవరించిన బీసీసీఐ.. ఇప్పుడు మరోసారి దీన్ని సవరించడం లేదా పూర్తిగా వాయిదా వేయక తప్పని పరిస్ధితులు ఎదురవుతున్నాయి. దీని వెనుక మూడు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ భారత్ లో నిర్వహించాలా లేక వాయిదా వేయాలా లేక విదేశాలకు మార్చాలా అని బోర్డు మల్లగుల్లాలు పడుతోంది. రేపు దీనిపై బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వాస్తవానికి ఐపీఎల్ 2026ను మార్చి 26న ప్రారంభించేలా షెడ్యూల్ విడుదల చేశారు. కానీ ఆ తర్వాత మార్చి 28కి మార్చారు. ఇప్పుడు అది కాస్తా పూర్తిగా వాయిదా పడటం లేదా పూర్తి షెడ్యూల్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇరాన్ వార్, రెండు ఎల్పీజీ కొరత, మూడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు. వీటిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. దీని వెనుక ఉన్న కారణం కూడా ఇరాన్ వార్, ఎల్పీజీ కొరతలే. బీసీసీఐ ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలకు తాజా డెడ్ లైన్ ఈ నెల 12 లేదా 13గా పెట్టుకుంది. కానీ అప్పటికల్లా ఈ మూడు విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు.

IPL 2026 Postponement Looms Amid Iran Conflict Gas Crisis and State Elections

ఇరాన్ యుద్దం కారణంగా విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆయా ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి. అలాగే ఎల్బీజీ కొరత కారణంగా హోటల్స్ నడిపించలేని పరిస్ధితులు ఎదురవుతున్నాయి. గ్యాస్ కొరతతో హోటళ్లలో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురుకావచ్చనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. అలాగే ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. ఈ రాష్ట్రాల్లో మ్యాచ్ ల నిర్వహణ కష్టంగా మారొచ్చని బోర్డు అంచనా వేస్తోంది. అందుకే టోర్నీ ప్రారంభం నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే షెడ్యూల్ మార్పు లేదా వాయిదాపై ఆలోచిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ ఇప్పటికే వెల్లడించారు. ఆయా సమస్యలకు ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+