IPL 2026: తిలక్ వర్మ మర్మాంగానికి గాయం.. 150 స్పీడ్‌తో దూసుకొచ్చిన బంతి!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా తాజాగా తిలక్ వర్మ తీవ్రంగా గాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మకు తాకరాని చోట బంతి బలంగా తాకింది.
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి అతని మర్మంగాన్ని గాయపరించింది. ఈ దెబ్బకు తిలక్ వర్మ క్రీజులోనే కుప్పకూలాడు. నొప్పిన భరించలేక పిల్లి మొగ్గలు వేసాడు. ఫిజియోల సాయంతో బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ పూర్తి చేసిన తిలక్ వర్మ.. మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. గతంలో అతని వృషణాలకు సర్జరీ జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే చోట బంతి తగలడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం తిలక్ వర్మ గాయానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్‌ను తిలక్ వర్మ ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా సిక్సర్ బాదిన తిలక్ వర్మ.. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ వరుసగా 4, 4, 6, 6 బాది బౌలర్‌పై ఒత్తిడి పెంచాడు.

తన బౌలింగ్‌నే చితక్కొట్టాడనే కోపంతో ఆఖరి బంతిని అశోక్ శర్మ బలంగా విసిరాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ బంతిని అంచనా వేయడంలో తిలక్ వర్మ విఫలమయ్యాడు. దాంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని మర్మాంగానికి బలంగా తాకింది. ఈ దెబ్బకు అల్లాడిపోయిన తిలక్ వర్మ నేలపై కుప్పకూలాడు. నొప్పిని భరించలేక పిల్లి మొగ్గలు వేసాడు.
ఫిజియోల సాయంతో బ్యాటింగ్ కొనసాగించిన తిలక్ వర్మ ఇబ్బంది పడుతూనే పరుగెత్తాడు. ప్రస్తుతానికి అతని గాయం తీవ్రత గురించి తెలియకున్నా.. పెద్ద గాయమే అయినట్లు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు అతని వృషణాలకు సర్జరీ అయ్యింది. ఆ గాయం మళ్లీ తిరగబెడితే తిలక్ వర్మ కొన్ని వారాల పాటు ఆటకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
Tilak Varma was hit very hard in the stomach by the ball and fell to the ground, writhing in pain. However, he got back up and went on to score an incredible century.🔥🙌
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 20, 2026
Salute to you, star boy Tilak! 🫡 pic.twitter.com/HAEQGb4CuQ
12 బంతుల్లో 9 బౌండరీలు..
ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండటంతో క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న తిలక్ వర్మ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాతి 12 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ 12 బంతుల్లో తిలక్ వర్మ 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదడం విశేషం. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను 6, 4 తరలించి మరీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అతని ధాటికి ముంబై ఇండియన్స్ 199/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్‌తో పాటు నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.












Click it and Unblock the Notifications