IPL 2026: బుడ్డోడి వీక్ నెస్ బయటపెట్టేసిన ప్రఫుల్..! ఇతర బౌలర్లకూ అస్త్రం?

రెండు రోజుల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందుకు కారణం ఫామ్ తో సంబంధం లేకుండా మేటి బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని సన్ రైజర్స్ కొత్త బౌలర్, ఈ ఐపీఎల్ లోనే అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే (praful hinge) రెండో బంతికే డకౌట్ చేశాడు. వైభవ్ కోసం పక్కాగా ప్లాన్ చేసి అవుట్ చేసినట్లు ప్రఫుల్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇతర బౌలర్లకూ ఇదే అస్త్రంగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది.

ఈ మ్యాచ్ తర్వాత ప్రఫుల్.. బౌన్సర్‌తోనో లేదా మరే విధంగానైనా సరే, మొదటి బంతికే వైభవ్ ను అవుట్ చేస్తానని తాను ముందుగానే ఇద్దరు ముగ్గురికి చెప్పానని వెల్లడించాడు. అతను సరిగ్గా అదే చేశాడు. ప్రఫుల్ బలం అతని లైన్ అండ్ లెంగ్త్‌లో ఉంది. బంతితో అతని ఎగ్జిక్యూషన్ చాలా పటిష్టంగా ఉంటుందని అతను శిక్షణ పొందిన MRF పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ ఎం. సెంథిల్‌నాథన్ చెప్తున్నారు. అయితే ఇవాళ క్రికెట్లో ఓ బ్యాటర్ బలహీనతను గుర్తించడం అంత కష్టం కాదని, బహుశా ప్రతి జట్టుకు దాని గురించి తెలిసే ఉంటుందని, అంతిమంగా అంతా ఎగ్జిక్యూషన్‌పైనే ఆధారపడి ఉంటుందన్నారు.

The Vaibhav Vulnerability Praful Hinge Exposes Sooryavanshi s Weakness A Weapon for Every Bowler

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైభవ్ సూర్యవంశీ బలహీనత అతని హై బ్యాక్‌లిఫ్ట్. అలాగే భారీ షాట్లు ఆడేటప్పుడు ముందు కాలును పక్కకు జరిపే అలవాటు ఉంది. ఈ కదలిక అతడిని స్టంప్‌ల వైపు వచ్చే బంతులకు ఇబ్బందిపడేలా చేస్తుంది. దీనివల్ల బౌలర్లు వైభవ్ ఆడేందుకు చోటు లేకుండా చేయవచ్చు లేదా బ్యాట్‌కు, శరీరానికి మధ్య ఖాళీని సృష్టించవచ్చు. ఇది అతని బ్యాటింగ్ శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. నాణ్యమైన పేస్ బౌలింగ్, ముఖ్యంగా స్వింగ్ లేదా సరైన దిశలో వేసే బౌన్సర్లు, శరీరం వైపు వచ్చే హార్డ్-లెంగ్త్ బంతులతో కలిసినప్పుడు, అది ఈ యువ బ్యాటర్ ప్రభావాన్ని పరిమితం చేయగలదని పదేపదే రుజువైంది.

The Vaibhav Vulnerability Praful Hinge Exposes Sooryavanshi s Weakness A Weapon for Every Bowler

ఏప్రిల్ 10న గౌహతిలో రాజస్థాన్-బెంగళూరు మ్యాచ్‌లో భువనేశ్వర్ ఇలాంటి ప్రయత్నమే చేసినా వికెట్ రాలేదు. కానీ ప్రఫుల్ మాత్రమే తర్వాతి మ్యాచ్ లో సక్సెస్ అయ్యాడు. అలాగే బుమ్రా, హేజిల్ వుడ్ కూడా బౌన్సర్లు వేసినా వాటిని అమలు చేసిన విధానంలో తేడా ఉంది. బుమ్రా వేసిన బౌన్సర్, కొంచెం పొట్టిగా మరియు నెమ్మదిగా ఉండటంతో, సూర్యవంశీ కొట్టే ఆర్క్‌లో పైకి లేచింది. హేజిల్‌వుడ్ వేసిన బంతి, తల వెనుక భాగానికి దగ్గరగా వెళ్లడంతో, బ్యాటర్ సర్దుకుని, రెండు బంతులను స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్లుగా కొట్టడానికి తగినంత సమయం లభించిందని సెంధిల్ నాథన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+