Ishan Kishan పెళ్లి ఫిక్స్, కాబోయే భార్య ఎవరంటే - అఫీషియల్ ఎనౌన్స్ మెంట్..!!

టీ20 ప్రపంచ కప్ లో పాక్ పై భారత్ ఘన విజయం నమోదు చేసింది. అంచనాలకు భిన్నంగా అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం సాధించింది. అభిషేక్ అవుట్ అయినా... ఇషాన్ సంచలన ఇన్నింగ్స్ తో పాక్ కు చుక్కలు చూపించాడు. అరుదైన ఇన్నింగ్స్ తో ఇండియన్ ఫ్యాన్స్ కు మజా అందించాడు. ఇక, ఇప్పుడు ఇషాన్ వివాహం పైన చర్చ మొదలైంది. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ తోనే వివాహం ఖరారైంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు ఖరారు చేసారు. వివాహం ముహూర్తం సైతం దాదాపు ఫిక్స్ అయింది. ప్రపంచ కప్ వేళ ఇషాన్ వివాహ వార్త వైరల్ అవుతోంది.

టీ20 ప్రపంచ కప్ లో పాక్ పైన భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ ఆడిన ఆటను ప్రముఖులు ప్రశసంచారు. ఇషాన్ ఆట పైన అతని తల్లి తండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. టీమిండియా గెలవటంతో పాటుగా తమ కుమారుడుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావటం పైన ఇషాన్ తల్లి ఖుషీ అయ్యారు. ఇదే సమయంలో మరో కీలక అంశం ప్రకటించారు.గత రెండేళ్లుగా ఇషాన్ అతను చాలా కష్టపడ్డాడని, నిరంతరాయంగా దేశవాళీ క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాడని పేర్కొన్నారు.

Ishan Kishan mother reacts over his marriage with Aditi after his super innings against Pakistan in T20 World cup

పెళ్లికి సంబంధించిన చర్చలు చేయడం లేదన్నారు. అసలు అతనికి ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదని చెప్పారు. అయితే, అదే సమయంలో ఇషాన్ కిషన్ తాత అనురాగ్ పాండే ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నా తమకు సమ్మతమే అని చెప్పారు. అతని అన్నయ్య పల్లవిని పెళ్లి చేసుకుంటానంటే మేము ఒప్పుకున్నామని... ఇప్పుడు ఇషాన్ విషయంలో కూడా అలాగే చేస్తామని ప్రకటించారు.

ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ అదిథి..ఆమె జైపూర్‌లో ఉంటుందని వివరించారు. ఆమె ఒక మోడల్... మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఇక, ఇషాన్ కోచ్ ఉత్తమ్ మజుందార్ చిరకాల ప్రత్యర్థులపై ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో ఇషాన్ ఆడిన తీరును ఆయన కొనియాడారు. పాకిస్థాన్‌పై ఈ స్థాయిలో స్కోరు చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమని.. ఈ ఇన్నింగ్స్‌ను దేశానికి అంకితం చేయాలని ఇషాన్ కు సూచించినట్లు వివరించారు. ఇంతటి ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో అతను ఆడిన తీరు పట్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు.

Ishan Kishan mother reacts over his marriage with Aditi after his super innings against Pakistan in T20 World cup

గతంలో ఆసియా కప్‌లో కూడా అతను పాకిస్థాన్‌పై 80 పైచిలుకు పరుగులు చేశాడని గుర్తు చేసారు. ఇక.. ఇప్పుడు ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ గురించి నెట్ లో పూర్తి వివరాల కోసం సెర్చింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా 'మిస్ దివా 2018' విజేత. ఆమె తండ్రి జైపుర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2,70,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక, ప్రపంచ కప్ తరువాత పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+