SRH డాషింగ్ ప్లేయర్ సునామీ సెంచరీ: ఇక కావ్యా పాపను పట్టుకోలేం
సన్ రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ వికెట్ కీపర్, జార్ఖండ్ కేప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతని మెరుపు సెంచరీతో జార్ఖండ్ తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్ లో హర్యానాపై 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లోనే ఒక చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. జాతీయ సెలెక్టర్లకు తన పునరాగమనాన్ని సుస్పష్టం చేశాడు.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ తుది సమరంలో ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లో 101 పరుగులు బాదాడు. అతని బ్యాటింగ్ తో జార్ఖండ్ 262 పరుగులు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఈ భారీ స్కోరు హర్యానా తొలి టైటిల్ ఆశలను దూరం చేసినట్టయింది. ఇషాన్ కిషన్‌కు తోడు యువ బ్యాటర్లు కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్ కూడా తమదైన శైలిలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.

వారు ఇద్దరూ జార్ఖండ్ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు. 263 పరుగులను హర్యానా అందుకోలేకపోయింది. హర్యానా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. హర్యానా బౌలర్లు తొలి పవర్‌ప్లేలో ఓపెనర్ విరాట్ సింగ్‌ను త్వరగా ఔట్ చేసి శుభారంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో బంతి స్వింగ్ అవుతోండటంతో ఇషాన్ కిషన్ కూడా తొలుత ఒత్తిడికి గురయ్యాడు. క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. పరుగులు చేయలేకపోయాడు.
మొదటి రెండు ఓవర్ల తర్వాత ఇషాన్ కిషన్- కుమార్ కుషాగ్రా క్రీజులో కుదురుకున్నారు. హర్యానా బౌలింగ్‌ను చీల్చిచెండాడారు. రెండో వికెట్‌కు 177 పరుగులు జోడించారు వీరిద్దరూ. ఇది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ చరిత్రలోనే అతిపెద్ద భాగస్వామ్యం. 15వ, 16వ ఓవర్లలో వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్ చెలరేగారు. 29 బంతుల్లో 75 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అనంతరం ఛేదనలో హర్యానా తడబడింది. తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలిందా జట్టుకు. పేసర్ వికాస్ సింగ్ మొదటి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి హర్యానా ఆశలపై నీళ్లు చల్లాడు. నిశాంత్ సింధు, యశ్‌వర్ధన్ దలాల్ 27 బంతుల్లో 67 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాస్త ఆశలు రేపారు. అదే సమయంలో ఇషాన్ కిషన్ స్పిన్నర్ అనుకూల్ రాయ్‌ను రంగంలోకి దించాడు. రాయ్ తన మొదటి ఓవర్‌లోనే ఈ ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించాడు. ఈ రెండు వికెట్ల పతనం నుండి కోలుకోలేకపోయింది హర్యానా. 18.3 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది.
ఇషాన్ కిషన్ ఈ టోర్నమెంట్‌ను 200 స్ట్రైక్ రేట్‌తో, 57.44 సగటుతో ముగించాడు. ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఫుల్ ఫామ్ లోకి రావడం సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ లో జోష్ నింపినట్టయింది. కేప్టెన్ గా కూడా సత్తాచాటాడు. జార్ఖండ్ కు మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.
-
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
అరె ఓ సాంబా.. ఇంకో రెండు పాయింట్లు ఇచ్చుకో -
కృనాల్ పాండ్యా విసిరేసే బంతులను ముంబై బ్యాటర్లు ఎలా ఫేస్ చేస్తారో..!! -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
IPL 2026: బోణీ కొట్టిన చెన్నై.. మ్యాచ్ మలుపు తిరిగిందక్కడే! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!! -
బీసీసీఐ రూల్స్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్‌కు చిక్కులు! -
ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక -
ఆయన వల్లే ఈ సెంచరీ.. నా లక్కీ ఛార్మ్: సంజూ శాంసన్ -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా? -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications