హార్ట్ బ్రేక్ చేసిన John Cena
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం జాన్ సెనా హార్ట్ బ్రేక్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. WWE కు గుడ్ బై చెప్పాడు. ఇందులో నుంచి అధికారికంగా తప్పుకొన్నాడు. ఓటమితో తన సుదీర్ఘ కేరీర్ ను ముగించాడు. తాను చిట్టచివరి గేమ్ లో గుంథేర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. తనను ఆదరించిన కోట్లాదిమంది అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
వాషింగ్టన్ డీసీలో జరిగిన శాటర్ డే నైట్ మెయిన్ ఈవెంట్ లో గుంథర్‌తో చివరి గేమ్ ఆడాడు జాన్ సెనా. ఆద్యంతం ఉద్విగ్నభరిత వాతావరణంలో సాగిన గేమ్ ఇది. గేమ్ కొనసాగుతున్నంత సేపూ వీక్షకులు ఎమోషన్ అయ్యారు. భావోద్వేగానికి గురయ్యారు. గుంథర్ పంచ్ ల ధాటికి ఓడిపోతున్నాడని తెలిసినా ప్రతి రౌండ్ లోనూ జాన్ సెనాకు సపోర్ట్ గా నిలిచారు అభిమానులు. అతన్ని మరింత ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఓటమి అనంతరం తన సుదీర్ఘ కెరీర్‌కు భావోద్వేగపూరితమైన ముగింపు పలికాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తినిచ్చింది అతని కెరీర్. ఓ తరానికి నిలిచిపోయే వారసత్వాన్ని అందించిందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ వీడ్కోలు మ్యాచ్‌లో అభిమానుల నోస్టాల్జియాను తట్టిలేపారు. 5-నకిల్ షఫుల్, ఎస్‌టీఎఫ్, ఆటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్ వంటి మెరుపులు రింగ్‌లో మెరిశాయి. అభిమానులను ఉర్రూతలూగించాయి. అనూహ్యంగా గుంథర్ స్లీపర్ హోల్డ్‌కు జాన్ సేనా లొంగిపోవాల్సి వచ్చింది.
ఇది అతని సుదీర్ఘ కెరీర్‌లో మొట్టమొదటి సబ్మిషన్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎరీనాలో క్షణకాలం నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సెనా ర్యాంప్ డౌన్‌కి నడుస్తూ అభివాదం చేశాడు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కెమెరాలకు చివరి ఫోజులిచ్చాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు వీడ్కోలు చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు.
One final goodbye.
— WWE (@WWE) December 14, 2025
Thank YOU, @JohnCena. 🫡 pic.twitter.com/hg8gNpbILG
డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఇన్నేళ్లు అభిమానులను ఆలరించాననే అనుకుంటున్నానని, ఒకరకంగా వారికి సేవలు అందించానని జాన్ సెనా వ్యాఖ్యానించాడు. ఇది తన ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. అనంతరం ఎరీనాలో అతని కెరీర్ కు సంబంధించిన వీడియో ప్రదర్శించారు. తన షూస్ ను రింగ్‌లో ఉంచి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చివరిగా "యు కాంట్ సీ మీ" అని వ్యాఖ్యానించాడు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications