తల్లి కాబోతున్న హీరోయిన్..ప్రమోషన్ కొట్టేసిన స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాకి క్రికెట్ వర్గాలు. కేఎల్ రాహుల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి ధృవికరించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టినే కేఎల్ రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు హాజరైన సునీల్ శెట్ కొనకని ఆసక్తికర విషయానలను అభిమానులతో పంచుకున్నారు. ఈ షోలో కమెడియన్ భారతీ సింగ్ మాట్లాడుతూ..సునీల్ సార్.. మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్య అయితే ఎలా ఉంటారు? అని ప్రశ్నించింది.
దీనికి సునీల్ శెట్టి సమాధానం ఇస్తూ..తదుపరి సీజన్‌కి వచ్చే సమయానికి కల్లా తాను తాతయ్యగా అవుతాను అంటూ సునీల్ శెట్టి ఆన్సర్ ఇచ్చాడు. ఆయన సరదాగా అన్నారో లేదా సీరియస్‌గా అన్నారో తెలియదు కానీ చాలామంది కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. ''2025 లో మా ప్రార్థనలకు అందమైన ప్రతిరూపం రానుంది'' అని రాసుకొచ్చారు. అంతేకాకుండా చిన్ని పాదాలు షేర్ చేయడంతో పాటు దిష్టి చుక్కను కూడా పెట్టింది. దీంతో అతియా ప్రెగ్నెంట్ అయినట్లు అర్థమవుతోంది.

మొదట్లో స్నేహితులుగా ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ పరిచియం ప్రేమగా మార్చుకున్నారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి గురించి అనేక రుమార్స్ తెర మీదకు వచ్చినప్పటికీ ..వాటిపై ఎప్పుడు ఈ జంట స్పందించింది లేదు. 2021లో కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. నాలుగేళ్లు అతియా శెట్టితో డేటింగ్ చేసిన కేఎల్ గతేడాది ఆమెను వివాహం చేసుకున్నాడు.
2023లో భారతీయ సంప్రదాయం ప్రకారం రాహుల్- అతియాల పెళ్లి జరిగింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. లక్నో మ్యాచులు జరుగుతున్న సమయంలో అతియా గ్రౌండ్‌కు వచ్చి మరి తన భర్త టీంకు సపోర్ట్ చేస్తోంది. ఇక కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెరెంట్స్‌గా మారబోతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications