Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023: రాహుల్ కు కోహ్లీ కింగ్ లాంటి సలహా - గెలుపులో అదే టర్నింగ్..!!

ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. సాధ్యం కాదనుకున్న వేళ సాధ్యం చేసింది. కేవలం 12 బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు డక్కైటయ్యారు. ఆ సమయంలో తొలి మ్యాచ్ లోనే ఘోర పరాభవం తప్పదనే భావన కోట్లాది అభిమానుల్లో మొదలైంది. ఆ సమయంలో గ్రౌండ్ లో ఇద్దరు మొనగాళ్లు తమలోని యోధులను బయటకు తీసారు. తమ అనుభవం..సత్తా ఏంటో చాటారు. సంయమనంతో టీం ను విజయతీరాలకు చేర్చారు. రాహుల్ కు కోహ్లీ ఇచ్చిన ఆ ఒక్క సలహా గెలుపులో కీలకం అయింది.

రక్షించిన కోహ్లీ - రాహుల్:ఆసీస్ ను భారత్ బౌలర్లు 199 పరుగులకే ఆలౌట్ చేసారు. ఇక, భారత్ బ్యాటర్లకు లక్ష్యం చాలా చిన్నదని అందరూ భావించారు. కానీ, భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే ఊహించని షాక్ లు ఒక దాని తరువాత మరొకటి తప్పలేదు. 12 బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయి పెవిలియన్ కు చేరారు. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఛేజింగ్ వీరుడు కోహ్లీ తాను ఏంటో మరోసారి తన సత్తా చాటుకొనేలా చెన్నై గ్రౌండ్ లో తనకు ఉన్న అనుభవం ఏంటో నిరూపించాడు. తానే కాదు..

KL Rahul Revales that Kohli adivced him to Play in a test Cricet like manner in the match against Aus in Chepak

అసలు ఈ ప్రపంచ కప్ లో రాణిస్తాడా లేదా అనే సందేహాల నడుమ తనలోని పోరాట పటిమను బయట పెట్టి తన లోని కేఎల్ రాహుల్ మరోసారి తన సత్తా చాటాడు. అయితే ఈ సమయంలో కోహ్లీ తన పార్టనర్ రాహుల్ కు ఇచ్చిన ఓ సలహా మ్యాచ్ ను గెలుపు తీరాలకు చేర్చింది.

రాహుల్ కు కింగ్ సూచన:కోహ్లీ తనకు ఎలాంటి సలహా ఇచ్చాడో మ్యాచ్ గెలిచిన తరువాత రాహుల్ స్వయంగా వెల్లడించాడు. పిచ్ సహకరిస్తున్న వేళ..కాసేపు టెస్టు క్రికెట్ ఆడమని తనకు కోహ్లీ చేసిన సూచన బాగా పని చేసిందని రాహుల్ వెల్లడించాడు. కొత్త బంది పేసర్లకు సహరించిందని వివరించాడు. ఆ తరువాత స్పిన్ కు అనుకూలించింది. అటువంటి పిచ్ పై బ్యాటింగ్ అంత అనుకూలం కాదని, కానీ కోహ్లీ చెప్పిన విధంగా ప్రతీ బంతిని టెస్టు క్రికెట్ తరహాలో ఎదుర్కొంటూ..

సమయానుకూలంగా ఆడటంతో గెలిచామని రాహుల్ అసలు విషయాన్ని బయట పెట్టాడు. ఈ మొత్తం మ్యాచ్ లో కోహ్లీ - రాహుల్ ఇద్దరూ క్రీజులో ఉన్నంత సేపు భారత అభిమానుల ఆశలు సజీవంగా కనిపించాయి. కోహ్లీ ఇచ్చిన ఒక మ్యాచ్ ఆసీస్ ఫీల్డర చే జార్చటంతో ఒక విరాట్ ఎటువంటి అవకాశం ప్రత్యర్ధి టీంకు ఇవ్వలేదు.

KL Rahul Revales that Kohli adivced him to Play in a test Cricet like manner in the match against Aus in Chepak

గెలిపించిన అనుభవం:కోహ్లీ - రాహుల్ తమ ఎదురుగా ఆసీస్ బౌలర్లు రెచ్చి పోతున్న సమయంలో గొప్ప సంయమనం పాటించారు. కాస్త కుదురుకున్నాక కష్టపడి ఒక్కో పరుగు టీం ఖాతాలో జమ చేసారు. పిచ్ ను పూర్తిగా చదివాక.. ఆసీస్ వ్యూహం అర్దం అయ్యాక క్రమేణా పట్టు బిగించారు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ లో గొప్ప విజయంతో ప్రపంచ కప్ లో టీంకు శుభారంభం అందించారు.

ఛేజింగ్ లో కింగ్ గా చెప్పపుకొనే కోహ్లీ తాను ఆడటమే కాదు...ఇలాంటి సమయంలో ఎలా ఆడాలో కేఎల్ రాహుల్ కు సూచనలు చేస్తూ యోధుడిలా నిలచాడు. లక్ష్యం చిన్నదే అయినా..మ్యాచ్ లో కనిపించిన ఒత్తిడి..ఈ ఇద్దరు ఆడిన తీరు..అంతిమంగా సాధించిన విజయం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+