Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబర్ ఆజమ్ కు షాక్ మీద షాక్: పీసీబీ సంచలనం: పాపం బిడ్డ..ఎలా తట్టుకుంటున్నాడో గానీ

Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.

ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

Major Shake-Up Babar Azam and Mohammad Rizwan Demoted from Category A Contracts

ఈ టోర్నమెంట్ లో ఆడబోయే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో కొన్ని అనూహ్య మార్పులు కనిపించాయి. డాషింగ్ ఓపెనర్ బాబర్ ఆజమ్, మాజీ కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కు చోటు దక్కలేదు. ఈ ఇద్దరినీ పక్కనపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.

డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా టీ20 ఇంటర్నేషనల్స్ ఆడారు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్‌. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం దక్కలేదు వారికి. మొన్నటి వెస్టిండీస్ సిరీస్ లోనూ వీరిద్దరు విఫలమైన నేపథ్యంలో వేటు పడింది. సల్మాన్ అలీ ఆఘా జట్టుకు నాయకత్వం వహిస్తోన్నాడు. షహీన్ షా అఫ్రిది తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇప్పుడు తాజాగా వారిద్దరికీ మరో షాక్ ఇచ్చింది పీసీబీ. 2025-26 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్టులను పునర్వ్యవస్థీకరించింది. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్‌లను కేటగిరీ ఏ నుంచి తొలగించింది. ఈ టాప్ కేటగిరీలో ఏ ఒక్క ఆటగాడినీ చేర్చకపోవడం గమనార్హం. వచ్చే సీజన్ కోసం మొత్తం 30 మంది క్రికెటర్లకు పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టులు మంజూరు చేసింది. ఈ కాంట్రాక్టులు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. 2026 జూన్ 30 వరకు కొనసాగుతాయి.

బాబర్, రిజ్వాన్ కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడ లేని ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇద్దరూ గతంలో జట్టుకు నాయకత్వాన్ని వహించిన వారే. ఫామ్ ను కోల్పోవడం వల్ల కేప్టెన్సీని పోగొట్టుకున్నారు. ఆసియా కప్ 2025లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ లో కూడా బాబర్ పై వేటు పడింది.

తాజాగా జారీ చేసిన కాంట్రాక్ట్ వివరాలిలా ఉన్నాయి..

  • కేటగిరీ ఏ- ఇందులో ఏ ఒక్క ప్లేయర్ కూడా లేడు. నిన్నటివరకు ఇందులో ఉన్న బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లను తొలగించింది. వారు డీ ప్రమోట్ అయ్యారు.
  • కేటగిరీ బీ-: అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్, షహీన్ షా ఆఫ్రిది
  • కేటగిరీ సీ: అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రాఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సాహిబ్ జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్, సవూద్ షకీల్

కాగా- ఆమిర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, మిర్ హమ్జా, మహమ్మద్ అలీ, మహమ్మద్ హురైరా, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ సహా ఎనిమిది మంది ఆటగాళ్లకు ఈ ఏడాది కాంట్రాక్టులు దక్కలేదు. వీరంతా గతంలో కేటగిరీ డీలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+