RCB కి రూ. 16,303 కోట్లు ఆఫర్.. లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ రా బై

గత ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా ఆవిర్భవించిన జోష్ లో ఉంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కప్ ను ముద్దాడింది. కొత్త కేప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించి.. విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ ఊపులో ఉన్న ఆర్సీబీ ఫ్రాంఛైజీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.

విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరట్స్ కంపెనీతో కలిసి ఆర్సీబీలో భాగస్వామిగా ఉంటోన్న డయాజియా.. ఫ్రాంఛైజీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ జట్టులో ఉన్న తన వాటాలను పూర్తిగా విక్రయించనుందా సంస్థ. ఇందులో భాగంగా తన భాగస్వామ్య హక్కుల వాల్యుయేషన్ కూడా పూర్తి చేసింది. దాదాపుగా రెండు బిలియన్ డాలర్లకు వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.

Manchester United Owner Makes Highest Offer to Buy IPL Champions as New RCB Bidder Appears

ఈ హక్కులను కొనుగోలు చేయడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. వేల కోట్ల రూపాయలతో బిడ్డింగ్స్ దాఖలు చేశాయి. వీటన్నింటినీ కూడా తాజాగా షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తం అయిదు సంస్థలు రేసులో నిలిచాయి. ఇందులో- టాప్ కంటెండర్ గా నిలిచింది మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్. 16,303 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ దాఖలు చేసింది. మాంచెస్టర్ యునైటెడ్ చీఫ్ అవ్రామ్ గ్లేజర్ ఈ బిడ్ వేశారు. ఇంగ్లాండ్ కు చెందిన ఫుట్ బాల్ క్లబ్ ఇది.

మిగిలిన నాలుగు సంస్థలు కూడా భారత్ కు చెందినవే. వీటిల్లో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా ఆదార్ పూనావాలా- రూ. 15,000 కోట్లు, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ గౌతమ్ అదాని- రూ. 14,000 కోట్లు, జేఎస్ డబ్ల్యూ చీఫ్ పార్థ్ జిందాల్- 12,000, భారత సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త సంజయ్ గోవిల్- 10,000 కోట్ల రూపాయలతో బిడ్స్ వేశారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ క్రికెట్, వెల్ష్ పైర్ క్రికెట్ టీమ్ కు సంజయ్ గోవిల్ కో ఓనర్ గా వ్యవహరిస్తోన్నారాయన.

అత్యధిక బిడ్ దాఖలు చేసిన మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్ సీ చేతికి ఆర్సీబీ వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయి.. ఈ బిడ్స్ అమౌంట్ ను బట్టి చూస్తే. ఈ డీల్ ఫైనల్ అయితే ఆర్సీబీ ఐపీఎల్ పురుషులు, డబ్ల్యూపీఎల్ (WPL) మహిళల జట్ల యాజమాన్యం మాంచెస్టర్ చేతికి అందుతుంది. లాన్సర్ క్యాపిటల్ ద్వారా యూఏఈ ఐఎల్టీ20 లీగ్‌లో డెసర్ట్ వైపర్స్ జట్టును కొనుగోలు చేసిందీ ఎఫ్ సీ. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీని పొందడానికి అడుగు దూరంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+