Babar Azam: బాబర్ ను తప్పించలేరు-అతనో ఇన్సూరెన్స్-ఇంగ్లండ్ మాజీ కెప్టెన్..!

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పేలవ ఆటతీరుతో సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఓ దశలో గ్రూప్ దశ దాటి సూపర్ 8కు చేరుతుందా అన్న అనుమానాల మధ్య నమీబియాను ఓడించి ఎలైట్ గ్రూప్ కు అర్హత సాధించింది. అయితే పాకిస్తాన్ జట్టు ఓడిపోయినప్పుడల్లా తెరపైకి వస్తున్న పేరు బాబర్ ఆజం (babar azam). పాక్ జట్టులో సీనియర్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ కూడా అయిన బాబర్ తన స్దాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోయినా ఇంకా జట్టులో కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ బాబర్ ఆజం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు విజయాల పరిస్ధితి ఎలా ఉన్నా బాబర్ ఆజంకు మాత్రం ఓటమి లేదన్నాడు. జట్టు సెటప్‌లోని రాజకీయ, నిర్మాణాత్మక వాస్తవాల వల్ల అతన్ని కోచ్ మైక్ హెస్సెన్ ఇన్సూరెన్స్ పాలసీగా మార్చి వాడుకుంటున్నాడని వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Michael Vaughan Babar Azam is Undroppable and coach mike hessen s Insurance

ఇంగ్లాండ్‌ చేతిలో పాకిస్తాన్ నిన్న రెండు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత మరోసారి బాబర్ స్ధానంపై చర్చ మొదలైంది. ఈ మ్యాచ్‌లో బాబర్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 24 బంతుల్లో 25 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అతని మొత్తం స్ట్రైక్ రేట్ ఇప్పుడు 111.5కి పడిపోయింది. ఇది టోర్నమెంట్ చరిత్రలో స్పెషలిస్ట్ బ్యాటర్లలో అత్యల్పం. పాకిస్తాన్ కు కోచ్ గా వెళ్లే విదేశీయుల పరిస్ధితి తాను అర్దం చేసుకోగలలని, అక్కడ ఏం జరుగుతుందో తాను ఊహించగలనని మైకేల్ వాన్ తెలిపాడు. బాబర్ ఆజంను తప్పనిసరిగా ఆడించాల్సిన రాజకీయ పరిస్ధితుల్లో కోచ్ హెస్సెన్ అతన్ని జట్టుకు ఇన్సూరెన్స్ లా వాడుకుంటున్నాడని తెలిపాడు. అందుకే అతను నాలుగో స్ధానంలో వచ్చి తాపీగా అడుకుంటున్నాడని వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+