అభిషేక్ శర్మ ఓ గాలిగాడు: పాక్ మాజీ పేసర్

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందే మాటల యుద్ధం మొదలైంది. టీమిండియా యువ సెన్సేషన్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ విమర్శల దాడికి దిగాడు. ఓ పాకిస్థానీ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్‌ను తక్కువ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ విమర్శల పర్వం
అభిషేక్ శర్మను కేవలం ఒక 'స్లాగర్' (బంతిని విచక్షణ రహితంగా బాదేవాడు) అని సంబోధించిన ఆమిర్.. అతడికి అసలు బ్యాటింగ్ టెక్నిక్ లేదని విమర్శించాడు. "అభిషేక్ శర్మ ప్రతి బంతిని గుడ్డిగా బాదడానికే ప్రయత్నిస్తాడు. అతడికి క్రీజులో నిలకడ లేదు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒకసారి మాత్రమే స్కోరు చేస్తాడు, మిగిలిన సమయాల్లో తక్కువ పరుగులకే ఔట్ అవుతున్నాడు" అని మహమ్మద్ ఆమిర్ ఎద్దేవా చేశాడు. కేవలం తనకు ఇష్టమైన జోన్‌లోకి బంతులు వస్తేనే కొట్టగలడని.. బంతి కొంచెం స్వింగ్ అయినా అతడు తడబడతాడని ఆమిర్ విశ్లేషించాడు.

Mohammad Amir Calls Abhishek Sharma a Slogger Ahead of India vs Pakistan T20 World Cup Clash

బాడీ లైన్ బౌలింగ్ సవాల్
అభిషేక్ శర్మను కట్టడి చేసేందుకు పాక్ బౌలర్లకు మహమ్మద్ ఆమిర్ కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. అతడి బాడీని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తే వికెట్ తీయడం సులభమని పేర్కొన్నాడు. కేవలం అదృష్టం కొద్దీ కొన్ని పరుగులు వస్తున్నాయని.. స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కొని పరుగులు సాధించినప్పుడే అతడిని తాను ఒక నాణ్యమైన బ్యాటర్‌గా గుర్తిస్తానని ఆమిర్ సవాల్ విసిరాడు. అభిషేక్ శర్మ ఆడేది అత్యంత ప్రమాదకరమైన, రిస్క్‌తో కూడిన ఆట అని, ఇది జట్టుకు ఎప్పుడూ లాభించదని అతడు అభిప్రాయపడ్డాడు.

అభిషేక్ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్:
మరోవైపు పాకిస్థాన్‌తో జరిగే కీలక పోరులో అభిషేక్ శర్మ ఆడతాడా లేదా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్న అభిషేక్ శర్మ.. నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అభిషేక్ సుమారు 2 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. అయితే అతడు ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడని.. పాక్‌తో మ్యాచ్ సమయానికి సిద్ధమవుతాడని వరుణ్ చక్రవర్తి వంటి సహచర ఆటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అభిషేక్ అద్భుత ప్రదర్శన చేసిన నేపథ్యంలో అభిషేక్ జట్టులో ఉండటం భారత్‌కు ఎంతో కీలకం.

అభిషేక్ ఫ్యాన్స్ ఫైర్
పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఆమిర్ అసూయకు నిదర్శనమని ఫ్యాన్స్ చురకలు అంటిస్తున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అభిషేక్ బరిలోకి దిగి తన బ్యాట్‌తోనే అమీర్‌కు గట్టి సమాధానం చెప్పాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మైండ్ గేమ్‌లో భాగంగానే పాక్ మాజీ క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+