'పుష్ప' రాజ్ ను ఫాలో అయిన పాకిస్థాన్ బౌలర్.. ఏమైందంటే..?
'తగ్గేదేలే' అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గడ్డం కింద చేయి తిప్పుతూ పుష్ప రాజ్ చేసిన మేనరిజానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్స్ పుష్ప రాజ్ ను ఫాలో అవుతూ.. పలు సందర్భాల్లో పుష్ప మేనరిజాన్ని బహిరంగంగా ప్రదర్శించారు.
గతంలో ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప సినిమాకు స్టెప్పులు వేస్తూ అలరించాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా అలానే చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అమీర్ చేరాడు. అవును ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ లో వికెట్ తీసిన తర్వాత తగ్గేదేలే అంటూ పుష్ప రాజ్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను క్రికెట్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

డెసర్ట్ వైపర్స్ x షార్జా మ్యాచ్
ఇంటర్నేషల్ లీగ్ టీ20లో భాగంగా జనవరి 22న దుబాయ్ వేదికగా డెసర్ట్ వైపర్స్ వర్సెస్ షార్జా వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్ కెప్టెన్ లాకీ ఫెర్గూసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదటి ఓవర్ ను మహ్మద్ ఆమిర్ వేశాడు. తొలి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు.
ఐఎల్ టీ లీగ్ డెజర్ట్ వారియర్స్ తరఫున ఆడుతున్న మహ్మద్ అమీర్.. ప్రత్యర్థి షార్జా వారియర్స్ కు చెందిన రోహన్ ముస్తాఫా ను ఔట్ చేసిన ఉత్సాహంతో మహ్మద్ ఆమిర్ తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ మేనరిజాన్ని ప్రదర్శించి సంబరాలు చేసుకున్నాడు. అది చూసిన స్టేడియంలోని ఫ్యాన్స్ వావ్ అంటూ కేరింతలు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్ 19.1 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటరల్లో జేసన్ రాయ్ (30 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 4, హసరంగ 3, సామ్ కర్రన్ 2 వికెట్లు పడగొట్టారు. 92 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్ వికెట్ కోల్పోకుండా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.












Click it and Unblock the Notifications