Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND Vs AUS: బంతి స్వింగ్ కాదా, రోహిత్ అలర్ట్ - షమీ ప్లాన్ "బీ"..!!

ప్రపంచ కప్ తుది సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య సొంత గడ్డ పైన టీమిండియా అహ్మదాబాద్ లో ఆసీసీ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు బలమైనవి కావటంతో మ్యాచ్ వ్యూహాల పైన ఆసక్తి నెలకొంి. ఈ మ్యాచ్ కు ప్రధానితో సహా సినీ ప్రముఖులు..మాజీ క్రికెటర్లు తరలి వస్తున్నారు. కోట్లాది మంది ఈ మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో నరేంద్రమోడీ స్టేడియంలో పిచ్ - టాస్ కీలకం కానున్నాయి.

టాస్ కీలకంగా : ఫైనల్స్ లో తొలుత టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకుంటుందా..ఫీల్డింగ్ ఎంచుకుంటుందా అనేది కీలకం. ఇదే పిచ్ పైన పాకిస్థాన్ పైన టీమిండియా విజయం సాధించింది. ఈ పిచ్ ను పరీక్షించిన కోచ్ ద్రావిడ్ .. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అంచనాకు వచ్చారు. చెన్నైలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో బారత ఓపెనింగ్ బ్యాటర్లను ఆసీస్ బౌలర్లు త్వరగానే పెవిలియన్ కు పంపారు. ఆ తరువాత కోహ్లీ - రాహుల్ తమ ఆట తీరుతో మ్యాచ్ గెలిపించారు. ఆసీస్ టీంలో ప్రతీ ఆటగాడి లోపాల పైన ఇప్పుడు టీమిండియా ఫోకస్ చేసింది. అదే సమయంలో టీం తుది కూర్పు పైన ఆచి తూచి నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే సూర్య ను డ్రాప్ చేసి స్పిన్నర్ గా అశ్విన్ ను తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Mohammed Shami is set to play with Plan -B in narendramodi staidum in the final against Australia

షమీ పైన అంచనాలు : భారత్ పేస్ త్రయం బూమ్రా, సిరాజ్, షమీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా షమీ బంతిని స్వింగ్ చేస్తున్న తీరుతో ప్రత్యర్ధి బ్యాటర్లు ముప్పతిప్పలు పడుతున్నారు. ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ షమీ 23 వికెట్లు తీసాడు. ఇక, ఫైనల్ ఆడే పిచ్ పైన స్వింగ్ గురించి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, బంతి స్వింగ్ కాకుంటే షమీ వికెట్లు తీయగలడా అనే సందేహం మొదలైంది. దీంతో, కెప్టెన్ రోహిత్ అలర్ట్ అయ్యాడు. షమీ ప్లాన్ బీ తో సిద్దమవుతున్నాడు. స్వింగ్ కాకుంటే పిచ్ పరిస్థితిని బట్టి బౌలింగ్ చేస్తూనే వికెట్లు ఎలా తీయాలనే దాని పైన ప్రాక్టీసు చేస్తున్నాడు. స్వింగ్ కాకపోయిన వీలైనంత వరకు బంతిని నేరుగా వికెట్లకు నేరుగా విసురుతూ..బ్యాటర్లు డ్రైవ్ చేసే క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్ వెళ్లే అవకాశం లెంగ్త్ లో బంతులు వేస్తానని షమీ విశ్వాసం వ్యక్తం చేసాడు.

Mohammed Shami is set to play with Plan -B in narendramodi staidum in the final against Australia

స్వింగ్ కాకుంటే : షమీ బౌలింగ్ పైన మాజీ కోచ్ రవిశాస్త్రితో సహా ప్రస్తుత కోచ్, కెప్టెన్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. షమీ తన నైపుణ్యం ప్రదర్శించి సరైన ప్రదేశంలో బంతి వేస్తూ వికెట్లు తీస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ఇక, ఎంతో ఒత్తిడి ఉండే ఫైనల్స్ లో షమీ తన బంతితో ఎలా రాణిస్తాడో..ఆసీస్ బ్యాటర్లను ఎలా పెవిలియన్ బాట పట్టిస్తాడో చూడాలి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+