Ravi shastri : ఇంగ్లాండ్ కోచ్‌గా రవిశాస్త్రి..?

ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 రోజుల్లోనే సిరీస్‌ను కోల్పోయి పరువు పోగొట్టుకోవడంతో, కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెకల్లమ్ ప్రవేశపెట్టిన 'బాజ్‌బాల్' (Bazball) వ్యూహం ఆస్ట్రేలియా గడ్డపై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సరైన వ్యక్తి అని మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియాను ఓడించే 'మంత్రం' ఆయనకే తెలుసు!
హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన పనేసర్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కు కీలక సూచనలు చేశారు. "ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఎలా ఓడించాలో రవిశాస్త్రికి బాగా తెలుసు. భారత్ తరఫున ఆయన రెండుసార్లు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌లు గెలిచారు. అది కూడా కీలకమైన బౌలర్లు గాయపడి, జట్టు బలహీనంగా ఉన్న సమయంలోనే ఆయన విజయం సాధించారు. గేమ్‌ను రీడ్ చేయడంలో రవిశాస్త్రి సిద్ధహస్తుడు," అని పనేసర్ కొనియాడారు.

monty-panesar-backs-ravi-shastri-for-england-head-coach-job-after-ashes-2025-disaster

పనేసర్ చేసిన కీలక వ్యాఖ్యలు:
"ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో గెలిచి దాదాపు 20 ఏళ్లు అవుతోందని చెప్పిన పనేసర్ అనుభవం లేని వారితో వ్యూహాలు రచించడం కంటే.. ఇప్పటికే విజయం సాధించిన వ్యక్తిని కోచ్‌గా పెట్టుకోవడం మేలని అభిప్రాయపడ్డాడు.రవిశాస్త్రిని కేవలం రెండేళ్ల పాటు టెస్ట్ ఫార్మాట్‌కు మాత్రమే కోచ్‌గా నియమించాలని.. ఇంగ్లాండ్‌లో జరగబోయే తదుపరి యాషెస్‌లో జట్టును విజేతగా నిలబెట్టడమే ఆయన ఏకైక లక్ష్యంగా ఉండాలని చెప్పారు."మనం ఎప్పుడూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా ఇంగ్లీష్ కోచ్‌లనే చూస్తున్నాం. ఒక భారతీయుడి గొంతు వినిపిస్తే అది ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్‌కు, సెలక్షన్ ప్రాసెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది." అని వ్యాఖ్యానించాడు.

మెల్‌బోర్న్‌లో ఊరట విజయం:
ఇదిలా ఉంటే నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఎట్టకేలకు పుంజుకుంది. మెల్‌బోర్న్ టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో స్కోరును 3-1కి తగ్గించింది. అయినప్పటికీ, మెకల్లమ్ హయాంలో 2022 నుండి ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా భారత్‌లను ఓడించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+