IPL 2024: MS Dhoni చెన్నైలో అడుగుపెట్టాడు: సంచలన పోస్ట్ పెట్టిన CSK!!

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. మార్చి 22వ తేదీన ఈ సీజన్ ప్రారంభం కానుండగా, ఈ సీజన్ పై క్రికెట్ ప్రపంచంలో ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. మొత్తం 74 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నమెంట్ ఒక బిగ్గెస్ట్ టోర్నమెంట్ గా చెప్పొచ్చు.

ఐపీఎల్ సీజన్ 17వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని చెన్నైలో అడుగుపెట్టడంతో ధోని అభిమానులలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఈ సీజన్ లో కూడా మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక భూమిక పోషించనున్నారు.

MS Dhoni arrives in Chennai CSK sensational post on dhoni role in IPL 2024 season17l

దిగ్గజ వికెట్ కీపర్ మరియు బ్యాటర్ అయిన ధోని ఈ సీజన్ కోసం ఎంపిక చేయబడిన సిఎస్కే ఇతర క్రికెటర్లతో కలిసి తాను కూడా శిక్షణ ప్రారంభించనున్నాడు. ఇప్పటికి ఐదుసార్లు ఐపీఎల్ గెలిచిన ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఈసారి సీజన్లో ధోని రాకతో టైటిల్ కొడతాం అన్న ధీమాలో ఉంది.

ఈ క్రమంలోనే ధోని రాకను స్వాగతిస్తూ సీఎస్కే ఫ్రాంచైజీ మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ "తలా దర్శనం" అంటూ ఒక శీర్షిక పెట్టింది. లీడర్ మళ్ళీ తన రాజ్యానికి వచ్చాడు అంటూ పేర్కొంది. గతేడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పై గెలిచి, చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపిఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్ ఉండనుంది.

ఇక సోషల్ మీడియాలో చాలాకాలంగా యాక్టివ్ గా లేని ధోని ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో "కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం ఎదురుచూస్తున్నా" అంటూ పోస్ట్ పెట్టడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఐపీఎల్ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోని పోషించబోయే కొత్త పాత్ర ఏంటి అన్నది అభిమానులు తెగ చర్చిస్తున్నారు. మొత్తానికి లీడర్ ఎంట్రీ ఇచ్చారని సీఎస్కే చాలా సగర్వంగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+