కెప్టెన్ కూల్ వ్యాపార సామ్రాజ్యం.. ధోనీ పెట్టుబడులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ స్టేడియంలో తన వ్యూహాలతో ప్రపంచాన్ని అలరించడమే కాకుండా బిజినెస్ ప్రపంచంలోనూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ ధోనీ అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతూ విజయవంతమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించుకున్నారు.
ప్రధాన రంగాలు, స్టార్టప్‌లలో పెట్టుబడులు
ఎంఎస్ ధోనీ కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫిన్‌టెక్, ఆహారం, ఫిట్‌నెస్, హోమ్ ఇంటీరియర్స్, క్రియేటర్ ఎకానమీ వంటి అనేక రంగాలలో ఎంఎస్ ధోనీ పెట్టుబడులు పెట్టారు. డ్రోన్ టెక్నాలజీ రంగంలో భాగంగా గరుడ ఏరోస్పేస్‌లో భాగస్వామిగా, బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ-బైక్ స్టార్టప్ 'EMotorad', కార్స్24లలో పెట్టుబడులు పెట్టారు. ఖాతాబుక్. హోమ్‌లేన్, రిగి, శాకా హారీ, ఫిట్‌నెస్ బ్రాండ్ 'తగ్డా రహో'లలో కూడా ఆయనకు వాటాలు ఉన్నాయి.

సొంత బ్రాండ్లు, వ్యాపారాలు
కేవలం స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కొన్ని బ్రాండ్ల స్థాపనలో కూడా ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించారు. 'కాప్టర్7' బ్రాండ్ పేరుతో వ్యాపారం నిర్వహించే 7Inc Brews కంపెనీకి ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ధోనీతో అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ వేర్, లైఫ్ స్టైల్ బ్రాండ్ 'SEVEN'లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంది. ధోనీ ఫ్యామిలీ ఆఫీస్ ద్వారా డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ACKOలో పెట్టుబడి పెట్టారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ అయిన KuKuలో పెట్టుబడి పెట్టడంతో పాటు 'Kuku TV' బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారారు.
సీఎస్కే వాటా కొనుగోలుపై పుకార్లు
ఇటీవల్ల ఎంస్ ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీలో కొంత వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ధోనీ మొదట 25 శాతం వాటాను కోరగా.. ఫ్రాంచైజీ యాజమాన్యం 5.5 శాతం వరకు మాత్రమే ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ చర్చలు కేవలం మౌఖికంగానే జరిగాయని.. ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరలేదని సమాచారం. క్రీడా రంగానికి వీడ్కోలు పలికిన అనంతరం కూడా క్రికెట్ స్టేడియంలో చూపించిన పక్కా ప్లానింగ్, వివేకాన్ని వ్యాపారం రంగంలోనూ చూపుతూ ధోనీ తన సామ్రాజ్యాన్ని విజయవంతంగా విస్తరిస్తున్నారు.













Click it and Unblock the Notifications