వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. తొలి త్రోలోనే అద్భుతం!

World Athletics Championship: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించారు. జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. ఫైనల్‌కు అర్హత సాధించడానికి 84.50 మీటర్ల మార్కును దాటాలి.. కానీ నీరజ్ చోప్రా ఏకంగా 84.85 మీటర్ల దూరం విసిరి ఈజీగా ఫైనల్లోకి అడుగుపెట్టారు.

ఫైనల్లో పాక్ అథ్లెట్‌తో పోటీ
నీరజ్ చోప్రా తన గ్రూపులో ఉన్న ఆరుగురు అథ్లెట్లలో మొదటి రౌండ్‌లోనే నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించిన ఏకైక ఆటగాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో నీరజ్ చోప్రా ఫైనల్ పోటీ కోసం గురువారం బరిలోకి దిగనున్నారు. నీరజ్ చోప్రాతో పాటు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా ఫైనల్లో ఉంటారు. వీరిద్దరూ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత ఒకే వేదికపై తలపడడం ఇదే తొలిసారి. ప్యారిస్‌లో అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రోతో గోల్డ్ గెలుచుకోగా.. నీరజ్ చోప్రా 89.45 మీటర్ల త్రోతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Neeraj Chopra Qualifies for World Athletics Final with Stunning First Throw

పైచేయి ఎవరిది?
2023లో హంగేరీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా 88.17 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ సాధించారు. అయితే అర్షద్ నదీమ్ ఒలింపిక్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్నారు. ఫైనల్లో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.

హ్యాండ్‌షేక్ వివాదంపై ఉత్కంఠ
ఈ క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ చోప్రా గ్రూప్-ఏలో ఉండగా.. అర్షద్ నదీమ్ గ్రూప్-బీలో ఉన్నారు. వీరిద్దరూ ఫైనల్‌కు చేరుకోవడంతో వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు హ్యాండ్ షేక్ చేసుకుంటారా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఆసియా కప్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేసేందుకు నిరాకరించిన వివాదం నేపథ్యంలో ఈ సంఘటనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 84.50 మీటర్ల మార్కును దాటిన లేదా టాప్-12లో ఉన్న అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+