Pat Cummins కు బిగ్ షాక్: టీ20 వరల్డ్ కప్ జట్టులో దక్కని చోటు

టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిపై అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. రోజుల తరబడి సాగుతోందీ వ్యవహారం మొత్తం కూడా. ఇప్పటికే బంగ్లాదేశ్ తప్పుకొంది. ఈ జట్టుకు మద్దతుగా టోర్నమెంట్ ను స్పాయిల్ చేసేలా పాకిస్తాన్ అనూహ్య ఎత్తుగడలు వేస్తోంది గానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కావట్లేదు.

పాట్ కమ్మిన్స్ దూరం..

ఈ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా జట్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్టార్ పేస్ బౌలర్ పాట్ కమిన్స్ టీ20 వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. జట్టు ఎంపికలో అతనికి స్థానం లభించలేదు. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్ ఎంపికయ్యాడు. అలాగే మాథ్యూ షార్ట్ కు కూడా చోటు దక్కలేదు. అతనికి బదులుగా మాట్ రెన్‌షాను జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా కొద్దిసేపటి కిందటేప్రకటించింది.

No Pat Cummins in T20 World Cup squad as the Cricket Australia Announces with New face Ben Dwarshuis

టీ20 ఇంటర్నేషనల్స్ లో రికార్డ్స్..

2025-26 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరఫున మూడో టెస్ట్‌ మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు పాట్ కమిన్స్. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్ లో కనిపించలేదు. చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ను 2024 జూన్ 24వ తేదీన ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ సూపర్ 8 దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్ లో జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. టీ20 ఇంటర్నేషనల్స్ లల్లో మొత్తం 66 వికెట్లు సాధించాడీ ఫాస్ట్ బౌలర్.

జోష్ హాజిల్‌వుడ్ నాయకత్వం..

పాట్ కమిన్స్ లేకపోవడం వల్ల ఆ జట్టు బౌలింగ్/ఆల్ రౌండ్ విభాగం కాస్త దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది. సమతౌల్యం లోపించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. పాట్ కమ్మిన్స్ గైర్హాజర్ వల్ల జట్టులో బౌలింగ్ డిపార్ట్ మెంట్ కు మరో పేసర్ జోష్ హాజిల్‌వుడ్ నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కొత్తగా జట్టులోకి వచ్చిన బెన్ డ్వార్షుయిస్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించనున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ ఉన్నారు.

ఆస్ట్రేలియా టీమ్ ఇదే..

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు భారత్‌లో అయిదు, శ్రీలంకలో మూడు స్టేడియాల్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా పూర్తి జట్టులో మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాట్ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఉన్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+