వరల్డ్ కప్ ముంగిట్లో బిగ్ షాక్: గాయపడ్డ స్టార్ బౌలర్

అక్లాండ్: మొన్నటి దేశంలో ఆసియా కప్ 2023 సందడి నెలకొంది. శ్రీలంక, పాకిస్తాన్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌ ఛాంపియన్‌గా నిలిచింది భారత్. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో లంకేయులను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఎనిమిదోసారి ఆసియా కప్ విన్నర్‌గా ఆవిర్భవించింది.

ఇంకొద్ది రోజుల్లో ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. అక్టోబర్ 5వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. 2019 ప్రపంచకప్ ఫైనల్స్‌లో హోరాహోరీగా తలపడ్డ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

ODI World Cup 2023: New Zealand pacer Tim Southee to undergo surgery for thumb injury

ఫైనల్ కూడా కలుపుకొంటే మొత్తం 48 మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. వారిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నాయి. నవంబర్ 12వ తేదీన భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు చేరుకుంది కూడా. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు భారత్‌తో ఓ మినీ సిరీస్ ఆడనుంది కంగారూ టీమ్. మూడు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ఇది. 22, 24, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు ఉంటాయి.

ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ టిమ్ సౌథీ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలో అతని కుడి బొటన వేలికి గాయమైంది. ఫీల్డింగ్ చేస్తూ బంతిని ఆపడానికి ప్రయత్నించి గాయపడ్డాడు సౌథీ. మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్‌ను వీడాడు.

ODI World Cup 2023: New Zealand pacer Tim Southee to undergo surgery for thumb injury

బొటన వేలు ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్ రిపోర్ట్‌లో తేలింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన సర్జరీ చేయించుకోనున్నాడు టిమ్ సౌథీ. సర్జరీ పూర్తయిన తరువాత డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ మీద అతను వరల్డ్ కప్‌లో ఆడతాడా? లేదా? అనేది నిర్ధారిస్తామని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పారు.

అక్టోబర్ 5వ తేదీన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడే తుదిజట్టుకు టీమ్ సౌథీ దూరం కావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కనీసం మూడు మ్యాచ్‌లను అతను మిస్ అవుతాడని చెబుతున్నారు. వరల్డ్ కప్ కంటే ముందు బంగ్లాదేశ్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్, వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్ ఓ వామప్ ఆడాల్సి ఉంది న్యూజిలాండ్. వీటన్నింటికీ సౌథీ దూరం అయినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+