Manu Bhaker: మనూ భాకర్ లో మరో కోణం ! గతంలో మహిళా రెజ్లర్లకు అండగా..!

పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో మహిళా షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్ లో సరబ్ జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకం సాధించింది. రెండు రోజుల క్రితమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోనూ మనూ కాంస్యం అందుకుంది. దీంతో దేశానికి స్వాతంత్రం వచ్చాక ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా మనూ భాకర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే ఒలింపిక్ పతకాల సాధన తర్వాత మనూ భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆమెలో మరో కోణం కూడా ఉంది. పతకాలు సాధించిన క్రీడాకారులు తమకు సమస్య ఎదురై రోడ్డెక్కాల్సి వచ్చినప్పుడు అండగా నిలిచిన చరిత్ర మనూ భాకర్ ది. గతంలో తమపై రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. అయితే వారి ఆందోళనకు ప్రభుత్వం వెంటనే స్పందించలేదు.

Olympic dual medalist manu bhaker big supporter of women wrestlers protest in past-old tweet viral

అయినా పలువురు మేటి క్రీడాకారులు మహిళా రెజ్లర్లకు అండగా నిలిచారు. ఢిల్లీ రోడ్లపై నిరసనలకు దిగుతున్న మహిళా రెజ్లర్లను రాజకీయ నేతలు చులకనగా మాట్లాడుతున్న తరుణంలో మనూ భాకర్ మాత్రం వారికి అండగా నిలిచింది. గతంలో ఎన్నో పతకాలు సాధించి దేశాన్ని గర్వపడేలా చేసిన తన తోటి అథ్లెట్లు (మహిళా రెజ్లర్లు)ను ఇలాంటి పరిస్ధితుల్లో చూడటం బాధగా ఉందంటూ మనూ భాకర్ ట్వీట్ చేసింది. అంతే కాదు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వం దీనికీ స్పందించలేదు. కానీ ఇప్పుడు మనూభాకర్ పతకం సాధించగానే రాజకీయ నేతలంతా ఆమెను అభినందించేందుకు క్యూ కడుతుండటంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+