పాకిస్తాన్ సూపర్ 8కు చేరాలంటే ఇలా జరిగితేనే, లేదంటే ఇంటికే...!!

T20 World cup: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. టీమిండియా సూపర్ 8 కు చేరుకుంది. పాకిస్థాన్ పైన విజయం తో భారత్ గ్రూపు లో తొలి స్థానంలో నిలిచింది. రన్ రేటు లోనే ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంది. ఇషాన్ కిషన్ సంచలన బ్యాటింగ్ తో టీమిండియా ప్రేమదాస స్టేడియం లో భారీ స్కోరు సాధించింది. బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితం గా పాక్ పై 61 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మరి.. పాకిస్థాన్ కు సూపర్ -8 ఛాన్స్ ఉందా... సంక్లిష్టమేనా. పాక్ సూపర్ 8 కి చేరాలంటే ఏం జరగాలి...ఎవరు ఎవరిపై గెలవాలి..

టీ2 ప్రపంచ కప్ లో గ్రూపు ఏ నుంచి టీమిండియా సూపర్-8 కు చేరింది. మరో స్థానం కోసం ఈ గ్రూపు నుంచి పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య పోటీ కొనసాగుతోంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలవగా, యునైటెడ్ స్టేట్స్‌పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

pakistan-must-win-their-last-group-stage-encounter-against-namibia-to-qualify-for-super-eight-her

కాగా.. భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.403కి పడిపోయింది. దాంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది. అమెరికా మాత్రం +0.787 NRRతో రెండో స్థానంలో నిలిచింది. యూఎస్ఏ ఇప్పటికే లీగ్ దశలో అన్ని మ్యాచులు పూర్తి చేసింది. కాగా.. పాకిస్తాన్ సూపర్ ఎయిట్స్‌కు అర్హత సాధించాలంటే చివరి గ్రూప్ మ్యాచ్‌లో నమీబియాపై తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ నమీబియా అనూహ్యంగా విజయం సాధిస్తే, పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.

పాక్ కు ఇక చావో రేవో.. ఇలా జరిగితేనే

అదే జరిగితే గ్రూపు - ఏ నుంచి భారత్‌తో పాటు అమెరికా సూపర్ ఎయిట్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆశ్చర్యకరంగా, గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచింది. చాలా అరుదైన పరిస్థితుల్లో నెదర్లాండ్స్ భారత్‌ను ఓడిస్తే, ఆ జట్టు నెట్ రన్‌రేట్ పాకిస్తాన్ కంటే మెరుగ్గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ vs నమీబియా మ్యాచ్ లో పాక్ తప్పని సరిగా విజయం సాధించాలి. పాకిస్తాన్ నమీబియాపై గెలిస్తే, భారత్ vs నెదర్లాండ్స్ మ్యాచ్ ఫలితం పాకిస్తాన్ అర్హతపై ఎలాంటి ప్రభావం చూపదు.

భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ లోపాలు బయట పడ్డాయి. షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజం, షడాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో.. ఇప్పుడు సూపర్ -8 కి అర్హత సాధించి తిరిగి నాకౌట్ మ్యాచుల్లో తమ సత్తా చాటాలనేది పాక్ ఆలోచన. ఇప్పుడు గ్రూపులో మూడో స్థానంలో నిలిచిన పాక్.. తరువాతి మ్యాచ్ లో గెలవటంతో పాటుగా మెరుగైన రన్ రేటుతో సూపర్ -8 కి చేరాల్సి ఉంటుంది. దీంతో.. అసలు పాక్ భవితవ్యం ఏంటనేది ఈ మ్యాచ్ లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+