నంజుకు తింటర్రోయ్

యూఏఈ వేదికగా సాగుతున్న ఆసియా కప్ లో పాకిస్తాన్ ముందంజ వేసింది. సూపర్ 4కు చేరుకుంది. లీగ్ దశలో ఆడిన మ్యాచ్ లల్లో విజయఢంకా మోగించిందా జట్టు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై సాధించిన విజయాలతో సూపర్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో భారత్ తో మరోసారి తలపడబోతోంది. ఈ నెల 21వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది.

ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ కు ఇది తొలి సూపర్ 4 మ్యాచ్ కావడం విశేషం. బుధవారం రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో యూఏఈపై 41 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో యూఏఈ తడబడింది. 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాకిస్థాన్ గ్రూప్ ఏలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి సూపర్ 4లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.

Pakistan vs India The Epic Clash in Asia Cup 2025 Super 4s

సూపర్ 4లో పాకిస్థాన్ గ్రూప్ బీ నుండి అర్హత సాధించిన మిగిలిన రెండు జట్లతో కూడా తలపడుతుంది. ప్రస్తుతం శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సూపర్ 4కు అర్హత సాధించేందుకు పోటీలో ఉన్నాయి. నేడు- ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకను ఓడిస్తే, ఆ జట్టు సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. అప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ ఆధారంగా మరో జట్టు అర్హత సాధిస్తుంది. శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే, ఆఫ్ఘనిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది. శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్ 4కు అర్హత సాధిస్తుంది.

ఆసియా కప్ 2025 సూపర్ 4 షెడ్యూల్..

సెప్టెంబర్ 20, శనివారం: బీ1 vs బీ2, దుబాయ్, రాత్రి 8:00

సెప్టెంబర్ 21, ఆదివారం: భారత్ vs పాకిస్థాన్, దుబాయ్, రాత్రి 8:00

సెప్టెంబర్ 23, మంగళవారం: ఏ2 vs బీ1, అబుదాబి, రాత్రి 8:00

సెప్టెంబర్ 24, బుధవారం: ఏ1 vs బీ2, దుబాయ్, రాత్రి 8:00

సెప్టెంబర్ 25, గురువారం: ఏ2 vs బీ2, దుబాయ్, రాత్రి 8:00

సెప్టెంబర్ 26, శుక్రవారం: ఏ1 vs బీ1, దుబాయ్, రాత్రి 8:00

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+