మన మాటలు మనం ఊహించని గాయాలు రేపుతాయి..!!

పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు టీమిండియా విమెన్ టీమ్ వైస్ కేప్టెన్ స్మృతి మంధాన తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని కోరారు. పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలను స్మృతి మంధాన వివరించలేదు. తనకు ప్రైవసీ కావాలని చెప్పారు.

దీనిపై తాజాగా పలాష్ ముచ్చల్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. స్మృతి మంధానాతో తన వివాహం జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అత్యంత క్లిష్టమైనదని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా ఎంతో ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నానని, ఇప్పుడు పాత సంబంధాల నుంచి బయటపడి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

Palash Muchhal Opens Up About Wedding cancel with Smriti Mandhana

తనపై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి న్యాయపరమైన చర్యలు తప్పవని పలాష్ ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి పలాష్ ముచ్చల్ తన పోస్ట్‌లో వివరించారు. ఈ బ్రేకప్ నుంచి వీలైనంత త్వరగా కోలుకుని, జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత సంబంధాల నుంచి దూరం అవుతున్నానని తేల్చి చెప్పారు.

తన వ్యక్తిగత విషయాల గురించి ప్రజలు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారని, ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని చూడటం చాలా కష్టంగా ఉందని పలాష్ వ్యాఖ్యానించారు. ఇది తన జీవితంలో అత్యంత కఠినమైన సమయం అని, దీన్ని ఎదుర్కొంటానని అన్నారు. ఎటువంటి నిర్ధారణ లేకుండా, అవాస్తవాలు, పుకార్ల ఆధారంగా ఏ వ్యక్తి గురించి అయినా ఒక అభిప్రాయం చెప్పే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విషయం ఎంత వరకు నిజం అనేది తెలుసుకోవాలని సూచించారు. మన మాటలు కొన్నిసార్లు మనం ఊహించని విధంగా తీవ్ర గాయాలను చేస్తాయని పేర్కొన్నారు.

తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పలాష్ ముచ్చల్ స్పష్టం చేశారు. ప్రపంచంలో చాలామంది తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో మనం ఈ పెళ్లి విషయాల గురించి చర్చించడం సహేతుకం కాదని, తప్పుడు, పరువు నష్టం కలిగించే మాటలను ప్రచారం చేసే వారిపై తన టీమ్ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+