టీమిండియా హ్యాండ్ షేక్ ఇవ్వకపోతే...! పీసీబీ ఛీఫ్ కీలక నిర్ణయం..!
భారత్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ సహా అన్ని సంబంధాలను తెంచుకుంటూ వస్తోంది. అయితే అంతర్జాతీయ వేదికలపై బహుళ దేశాలు ఆడే టోర్నీల్లో మాత్రం పాకిస్తాన్ తో తప్పనిసరి పరిస్ధితుల్లో ఆడుతున్నప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్లకు సంప్రదాయంగా ఇచ్చే షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్, పాకిస్తాన్ మంత్రి కూడా అయిన మొహసిన్ నక్వీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత ఆటగాళ్లు మాతో షేక్ హ్యాండ్ చేయకూడదనుకుంటే, మాకు కూడా అలా చేయాలనే ప్రత్యేక కోరిక ఏమీ లేదని మొహసిన్ నక్వీ తేల్చిచెప్పేశాడు. ఏం జరిగినా, అది భారతదేశంతో సమానంగా జరుగుతుందన్నాడు. దాన్ని మీరు చూస్తారంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. ఈ విధానం కొనసాగుతుందన్నాడు. వారు ఒక పని చేసినప్పుడు మనం వెనక్కి తగ్గడం సాధ్యం కాదని, అది జరగదని వెల్లడించాడు. తద్వారా తాము కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉంటామని స్పష్టం చేశాడు.

బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాళ్లకు నో హ్యాండ్ షేక్ విధానం కొనసాగిస్తే తాము కూడా అదే పని చేస్తామని పీసీబీ ఛీఫ్ మొహసిన్ నక్వీ తెలిపాడు. ఈ రోజుకు కూడా తమ నమ్మకం అలాగే ఉందన్నాడు. నన్ను నమ్మండి.. ప్రధానమంత్రి స్వయంగా రెండుసార్లు నాకు చెప్పారు, క్రీడల్లో రాజకీయాలు రానివ్వకూడదని. మొదటి రోజు నుండి, క్రికెట్, రాజకీయాలు వేరుగా ఉండాలనేది మా వైఖరి అన్నాడు. భారత్ ఏ మార్గాన్ని ఎంచుకున్నా పాకిస్తాన్ గౌరవిస్తుందని, కానీ పొరుగువారితో కూడా సమానంగా పోటీ పడుతుందని నఖ్వీ తెలిపాడు.

ఈ ఏడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆడిన మూడు ఆసియా కప్ టోర్నీల్లోనూ మన కెప్టెన్లు పాకిస్తాన్ కెప్టెన్లతో చేయి కలిపేందుకు నిరాకరించారు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా భారత కెప్టెన్లు పాకిస్తాన్ కెప్టెన్లకు హ్యాండ్ షేక్ ఇవ్వకుండా దూరంగా ఉంటున్నారు. పహల్గాం మృతులకు నివాళిగా ఇలా చేస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐతో పాటు భారత జట్ల కెప్టెన్లు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ వ్యాఖ్యలు చర్చనీయాాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications