ఎన్నికల ప్రచారంలో సంజూ శాంసన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. సంజూ శాంసన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ కనబరిచిన అద్భుతమైన ఆటతీరును ఆయన కొనియాడారు. కేరళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ చూపిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అమోఘమని అన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసేవాడే నిజమైన ఆటగాడని ఆయన అభివర్ణించారు.భారత వరల్డ్ కప్ 2026 హీరో, చెన్నై ఆటగాడు సంజు శాంసన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు వర్షం కురిపించారు. సంజు శాంసన్ లాగా బీజేపీ నేతలు పని చేయాలని అన్నారు.
ఇవాళ(శుక్రవారం) కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పేరును ప్రస్తావించారు. టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్‌లో సంజు శాంసన్ చెలరేగి ఆడాడని గుర్తు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయని తెలిపారు. జట్టుకు అతని అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు, అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడని, ఇదే ఒక నిజమైన ఆటగాడి గుర్తింపు అని అన్నారు. ప్రతి క్రీడాకారుడికి ఈ లక్షణాలు ఉండాలని.. అప్పుడే విజయం మన ముంగిటకు వస్తుందని ఆయన తెలిపారు. భారత జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలో గొప్ప ఆటగాడు రాణిస్తాడని, టీ20 ప్రపంచ కప్2026 సమయంలోనూ సంజూ తానేంటే రుజువు చేసుకున్నారని ప్రశంసించారు.

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ రోజున కూడా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటిని చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మీ అంకితభావం అత్యంత ముఖ్యమని, విజయం కోసం కష్టపడి పని చేయాలని కోరారు. సంజు తరహాలోనే పనిచేసి, పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో సంజుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కేరళ ప్రజలు కూడా సంజూ శాంసన్ ప్రదర్శన నుంచి నేర్చుకోవాలి.
𝐏𝐌 𝐌𝐨𝐝𝐢’𝐬 𝐬𝐡𝐨𝐮𝐭 𝐨𝐮𝐭 𝐭𝐨 𝐊𝐞𝐫𝐚𝐥𝐚𝐦 𝐥𝐚𝐝 𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐚𝐦𝐬𝐨𝐧! 🔥
— BJP (@BJP4India) April 3, 2026
Sanju Samson's T20 World Cup heroics steal the spotlight in PM Modi’s speech with Keralam karyakartas! 🏆
Tune in ⏬ pic.twitter.com/LgTNyL6nQg
ప్రపంచకప్‌లో శాంసన్ ఆటతీరును మనం చూశాం. టోర్నమెంట్‌లో కీలకమైన నాకౌట్ దశ వచ్చినప్పుడు, అతని ప్రదర్శన ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరిందన్నారు. టోర్నీ ఆరంభం నుంచి ముగింపు వరకు అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగు తూనే ఉన్నాయని చెప్పారు. జట్టుకు అతని అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు, అత్యుత్త మ ప్రదర్శన ఇచ్చాడని... ఇదే నిజమైన ఆటగాడికి ఉండాల్సిన లక్షణంగా మోదీ పేర్కొన్నారు.
-
కేరళ గడ్డపై సీఎం సవాల్! మా గ్యారంటీలపై డౌట్ ఉంటే తెలంగాణ రండి -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications