ఆ స్టార్‌కు అల్లు అర్జున్ బర్త్‌డే గ్రీటింగ్స్
Allu Arjun: నేడు- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పుట్టినరోజు. తన 38వ బర్త్‌డే వేడుకలను జరుపుకొంటోన్నాడీ లెఫ్ట్ హ్యాండర్ డాషింగ్ మాజీ ఓపెనర్. ఈ సందర్భంగా అతనికి పలువురు క్రికెటర్లు, మాజీలు, లెజెండరీ ప్లేయర్లు, సెలెబ్రెటీలు విషెస్ తెలియజేస్తోన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తగ్గేదే లేదంటూ పుష్ప ట్రేడ్ మార్క్ ఫోజు ఇచ్చిన డేవిడ్ వార్నర్ ఫొటోను తన విషెస్‌కు యాడ్ చేశాడు అల్లు అర్జున్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై బ్రదర్..అంటూ క్యాప్షన్ యాడ్ చేశాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2015, 2023 గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు డేవిడ్ వార్నర్. ఆ రెండు మెగా టోర్నమెంట్లల్లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ అతనే. 2013 వరల్డ్ కప్‌లో 510 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 500లకు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2019 ఐసీసీ వరల్డ్ కప్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ వార్నరే. టీ20 ప్రపంచకప్ 2021ను ఆస్ట్రేలియా గెలుకోవడంలోనూ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ అందుకున్నాడు.
ఈ ఏడాది జనవరి 1వ తేదీన వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్‌కూ గుడ్ బై చెప్పాడు. ఈ మూడు ఫార్మట్ల నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించాడు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని, తన అవసరం ఉందనుకుంటే ఈ టోర్నమెంట్‌లో ఆడతానని అప్పట్లో పేర్కొన్నాడు.
112వ టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన డేవిడ్ వార్నర్ 8,786 పరుగులు చేవాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్.. 44.60. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 335. వన్డేల్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు వార్నర్. ఇప్పటివరకు 161 వన్డేల్లో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications